ETV Bharat / sports

విజయ్ హజారే: తుది సమరంలో విజేత ఎవరు?

విజయ్​ హజారే ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో తలపడేందుకు ముంబయి, ఉత్తర్​ప్రదేశ్​ జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు దిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Uttar Pradesh likely to be in awe of Mumbai's 'SHAW Stopper'
విజయ్ హజారే ట్రోఫీ తుదిపోరులో నెగ్గేదెవరు?
author img

By

Published : Mar 14, 2021, 5:33 AM IST

ఆదివారం జరగనున్న విజయ్​ హజారే ట్రోఫీ తుది పోరుకు ముంబయి, ఉత్తర్​ప్రదేశ్​ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ గెలిచిన ముంబయి జట్టు ఈ ఏడాది కూడా కప్​ దక్కించుకుని నాలుగో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఉత్తర్​ప్రదేశ్​ జట్టు సన్నాహాలు చేస్తోంది. దిల్లీలోని అరుణ్​జైట్లీ మైదానంలో ఉదయం 9 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్​ జరగనుంది.

పృథ్వీ షా...

ఈ టోర్నీలో ముంబయి జట్టు సారథి పృథ్వీ షా రికార్డు ఇన్నింగ్స్​లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 754 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్​ల్లో 105, 227,185 పరుగులు చేసిన నాటౌట్​గా నిలిచాడు. ఇదేకాక.. యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్​ కీపర్ బ్యాట్స్​మన్ ఆదిత్య తారే, ఆల్​రౌండర్స్​ శివమ్ దుబే, షామ్స్ ములానీలతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది.

14 వికెట్లు తీసిన పేసర్​ ధవాల్ కులకర్ణి, స్పిన్​ త్రయం ప్రశాంత్ సోలంకి, తనూష్ కోటియన్, షామ్స్​ ములానితో బౌలర్ల పరంగానూ ముంబయి జట్టు సత్తా చాటేలా కనిపిస్తోంది.

ట్రోఫీపై ఆశతో...

కరన్​ శర్మ సారథ్యంలో ముంబయి జట్టుతో పోటాపోటీగా తలపడేందుకు సిద్ధమవుతోంది ఉత్తర్​ప్రదేశ్​ జట్టు. కెప్టెన్​ కరన్, వికెట్​ కీపర్ ఉపేంద్ర యాదవ్, అక్ష్​దీప్​నాథ్​ జట్టు తరఫున పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలర్ల పరంగాను ఉత్తర్​ ప్రదేశ్​ బలంగా ఉంది. పేసర్ యశ్ దయాల్, ఆఖిబ్ ఖాన్​ జట్టులో కీలక బౌలర్లుగా రాణిస్తున్నారు.

ఈ టోర్నీ సెమీఫైనల్స్​లోని తొలి మ్యాచ్​లో గుజరాత్​, ఉత్తరప్రదేశ్​ తలపడగా 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్​ గెలుపొంది.. తొలి ఫైనలిస్టుగా బెర్త్​ ఖరారు చేసుకుంది. రెండో మ్యాచ్​లో కర్ణాటక, ముంబయి జట్లు తలపడగా.. ఇందులో 72 పరుగుల తేడాతో ముంబయి విజయం సొంతం చేసుకుని ఫైనల్​కు చేరింది.

ఇదీ చదవండి:డోప్​ టెస్టుల్లో ఇద్దరు ఒలింపిక్స్ అథ్లెట్లు విఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.