మే 30న ప్రారంభం కానుంది వన్డే క్రికెట్ ప్రపంచకప్. గెలిచేందుకు జట్లన్నీ ప్రణాళికల రచిస్తున్నాయి. విజేతగా నిలిచిన టీమ్ భారీ స్థాయిలో నజరానా అందుకోనుంది. సుమారు 4 మిలియన్ డాలర్లు(రూ.28 కోట్లు) దక్కించుకోనుంది. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం.
ఇంగ్లాండ్ & వేల్స్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా వాటితో తలపడనుంది. జులై 16న ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది.
నజరానా వివరాలు:
- విజేత- 4 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.28 కోట్లు)
- రన్నరప్- 2 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.14 కోట్లు)
- సెమీ ఫైనల్లో ఓడిన జట్లకు: తలో 8 లక్షల యూఎస్ డాలర్లు(రూ.5.61 కోట్లు)
- లీగ్ దశ దాటిన జట్లకు: తలో లక్ష యూఎస్ డాలర్లు(రూ.70 లక్షలు)
- లీగ్ దశలో గెలిచిన జట్టుకు ఒక్కో మ్యాచ్కు 40 వేల యూఎస్ డాలర్లు(రూ. 28 లక్షలు)