విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు పేసర్ జయదేవ్ ఉనద్కత్. 20 మందితో కూడిన జట్టును సౌరాష్ట్ర క్రికెట్ సంఘం గురువారం విడుదల చేసింది. జట్టులో అనుభవజ్ఞుడైన ఉనద్కత్ సారథ్యం వహిస్తాడని తెలిపింది.
జట్టులో అర్పిత్, చిరాక్ జానీ, అవి బారోత్, ప్రేరత్ మన్కడ్, విశ్వనాథ్ జడేజా, వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్‌లకు చోటు లభించింది. బౌలర్లలో ఉనద్కత్ సహా చేతన్ సకారియా, ధర్మేంద్ర సింగ్ జడేజా, కమ్లేశ్ మక్వానా.. జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఫిబ్రవరి 20 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఎలైట్ ఈ గ్రూప్‌లో ఉంది సౌరాష్ట్ర. అందులో జమ్ము కశ్మీర్, హరియాణా, బంగాల్, చండీగఢ్, సర్వీసెస్‌లతో పోటీ పడనుంది. అన్ని మ్యాచ్‌లు కోల్‌కతాలోనే జరుగుతాయి. సౌరాష్ట్ర తొలి మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్‌తో ఫిబ్రవరి 21న తలపడనుంది.
ఇదీ చూడండి: హజారే ట్రోఫీకి నటరాజన్ దూరం