ETV Bharat / sports

టాప్​-5: ఐపీఎల్​లో సూపర్ ఫాస్ట్​ సెంచరీలు ఇవే - గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ ఐపీఎల్

కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. అసలు జరుగుతుందో లేదో అన్న అనుమానంలో అభిమానులున్నారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన శతకాలను ఓసారి గుర్తు చేసుుకుందాం.

టాప్​-5: ఐపీఎల్​లో సూపర్ ఫాస్ట్​ సెంచరీలు
ఐపీఎల్
author img

By

Published : Jul 7, 2020, 10:25 AM IST

కరోనా మహమ్మారి లేకపోతే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ ఇప్పటికే ముగిసేది. బ్యాట్స్​మెన్​ల సునామీ ఇన్నింగ్స్​లు, సెంచరీలు, బౌలర్ల ప్రదర్శన, ఫీల్డర్ల విన్యాసాలు ఇలా చాలా విషయాలపై ఫ్యాన్స్​ చర్చించుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ సరదా అంతా దూరమైంది. త్వరలోనే ఈ లీగ్ ప్రారంభమవ్వాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన సెంచరీలు ఎవరి పేరు మీద ఉన్నాయో ఓసారి చూద్దాం.

క్రిస్ గేల్ (30 బంతులు-2013)

సునామీ ఇన్నింగ్స్​లకు పెట్టింది పేరు క్రిస్ గేల్. అతడు ఒక్కసారి బ్యాట్​కు పనిచెప్పాడంటే బౌండరీల మోత మోగాల్సిందే. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు బంతి బౌండరీ దాటడమే లక్ష్యం అన్న విధంగా అతడి బ్యాటింగ్ ఉంటుంది. ఈ ఆటగాడికి టీ20 లీగ్​లంటే మరీ సరదా. అందుల్లో ఆడటానికి తెగ ఇష్టపడతాడు. ఐపీఎల్​లోనూ ఇతడి పేరిట పలు రికార్డులు ఉన్నాయి. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీ ఒకటి. 2013లో పుణె వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో గేల్ తన సునామీ ఇన్నింగ్స్​ను రుచి చూపించాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి బెంగళూరు ఫ్యాన్స్​కు మజా అందించాడు.

Top 5: Fastest centuries in IPL
గేల్

పుణె బౌలర్లను ఊచకోత కోసిన గేల్ చెమట పట్టకుండా అలవోకగా సెంచరీ సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే శతకంతో పాటు 66 బంతుల్లో 175 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​తో పాటు టీ20 క్రికెట్​లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో స్ట్రైక్ రేట్​ 266తో పరుగులు సాధించాడు.. ఇతడి ధాటికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇది కూడా ఐపీఎల్​లో ఓ జట్టు అత్యధిక స్కోరుగా నిలిచింది. కానీ పుణె మాత్రం బెంగళూరుకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఆర్సీబీ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

యూసఫ్ పఠాన్ (37 బంతులు-2010)

2010 ఐపీఎల్​లో తన విధ్వంసకర ప్రదర్శనతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్​ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. అప్పటికే తన విఫల ప్రదర్శనతో ఉన్న యూసఫ్ ఈ మ్యాచ్​లో మాత్రం తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీతో జట్టుకు విజయాన్నందించినంత పని చేశాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్​గా వెనుతిరగగా.. ఫలితం తారుమారైంది. ఈ ప్రదర్శనతో మూడేళ్లు ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు యూసఫ్. 2013లో గేల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. యూసప్ ఈ మ్యాచ్​లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు సాధించాడు.

Top 5: Fastest centuries in IPL
పఠాన్

డేవిడ్ మిల్లర్ (38 బంతులు-2013)

ఐపీఎల్ చరిత్రలో 2013 సీజన్​ను మోస్ట్ ఎంటర్​టైనింగ్​ ఎడిషన్​​గా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఛేజ్​లు, బ్యాట్స్​మెన్స్ విధ్వంసకర ఇన్నింగ్స్, ఉత్కంఠ రేపే మ్యాచ్​లు ఇలా ఈ ఏడాది క్రికెట్ ప్రేక్షకుల్ని గొప్పగా అలరించిందీ లీగ్. గేల్​ సునామీ సెంచరీ చేసిన కొన్ని రోజులకే మరో స్టైలిష్​ శతకం అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ మ్యాచ్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మొదట 190 పరుగులు చేయగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ 13 ఓవర్లలో 95 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఐదో నెంబర్ బ్యాట్స్​మన్​గా వచ్చిన డేవిడ్ మిల్లర్ కేవలం 54 నిమిషాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో చెలరేగిపోయాడు. 265 స్ట్రైక్​ రేట్​తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఇంకా 12 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయ బేరీ మోగించింది. మూడు పరుగులు చేస్తే జట్టు గెలుపు అనగా 95 పరుగుల వద్ద ఉన్న మిల్లర్ సిక్స్​తో సెంచరీతో పాటు జట్టుకు విజయాన్ని చేకూర్చాడు.

Top 5: Fastest centuries in IPL
మిల్లర్

ఆడమ్ గిల్​క్రిస్ట్​ (42 బంతులు-2008)

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ఆడమ్ గిల్​క్రిస్ట్ ఐపీఎల్​లోనూ సత్తాచాటాడు. 2008లో ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఈ దక్కన్ ఛార్జర్స్ ఆటగాడు మెరుపు ఇన్నింగ్స్​తో అలరించాడు. 155 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లోనే సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరో ఓపెనర్ వీవీఎస్ లక్ష్మణ్ 7 పరుగులతో రాణించడం వల్ల దక్కన్ ఛార్జర్స్​ 10 వికెట్ల తేడాతో మరపురాని విజయం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో గిల్​క్రిస్ట్​ 9 ఫోర్లు, 10 సిక్సులు సాధించాడు. మొత్తంగా 47 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇప్పటికి 12 ఎడిషన్లు పూర్తయినా గిల్​క్రిస్ట శతకం నాలుగో స్థానంలో నిలవడం విశేషం.

Top 5: Fastest centuries in IPL
గిల్​క్రిస్ట్

ఏబీ డివిలియర్స్ (2016), డేవిడ్ వార్నర్ (2017)- 43 బంతులు

ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ మోస్ట్ స్టైలిష్, విధ్వంసకర ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరికి భారత్​లోనూ గొప్ప ఫ్యాన్ ఫాలోయంగ్ ఉంది. దానికి కారణం ఐపీఎల్​లో వీరి ప్రదర్శనే. అయితే ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన శతకం వీరిద్దరి పేరిటా ఉంది. 2016లో గుజరాత్ లయన్స్​పై సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో 43 బంతుల్లో సెంచరీ బాదాడు డివిలియర్స్. తన సొంత మైదానం హైదరాబాద్​ రాజీవ్​గాంధీ స్టేడియంలో కోల్​కతా నైటరైడర్స్​పై ఈ శతకం సాధించాడు వార్నర్. 10 ఫోర్లు, 12 సిక్సులతో 52 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్​గా నిలిచిన ఏబీ.. బెంగళూరుకు విజయాన్నందించాడు. అలాగే 59 బంతుల్లో 126 పరుగులతో కేకేఆర్​ పతనాన్ని శాసించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.

Top 5: Fastest centuries in IPL
డివిలియర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.