ETV Bharat / sports

స్మిత్‌కు ఇక కెప్టెన్సీ దక్కదా? - సారథి స్టీవ్​ స్మిత్​

ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​కు కెప్టెన్సీ అప్పజెప్పడంపై తాము చర్చించనేలేదన్నాడు చీఫ్​ సెలక్టర్​ ట్రెవర్​ హాన్స్​. దీంతో స్మిత్​కు సారథి పగ్గాలు అందుకునే అన్ని దారులు మూసుకుపోయినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Smith
స్మిత్
author img

By

Published : Nov 13, 2020, 7:33 AM IST

స్టీవ్‌ స్మిత్‌కు తిరిగి కెప్టెన్సీ దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్లో చర్చ కొనసాగుతూనే ఉంది. బాల్‌ టాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో స్మిత్‌ మూడేళ్ల కింద కెప్టెన్సీని కోల్పోయాడు. జట్టుకు సారథ్యం వహించకుండా అతడిపై విధించిన నిషేధం ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయితే తాజాగా ఆస్ట్రేలియా సెలక్టర్లు పైన్‌ నేతృత్వంలో టెస్టు జట్టును ప్రకటించిన నేపథ్యంలో తిరిగి పగ్గాలు అందుకునేందుకు స్మిత్‌కు దారులు మూసుకుపోయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కెప్టెన్‌ను ఎంపిక చేసే సమయంలో తాము స్మిత్‌ గురించి చర్చించనేలేదని ఆస్ట్రేలియా క్రికెట్​ చీఫ్​ సెలక్టర్​ ట్రెవర్‌ హాన్స్‌ స్పష్టం చేశాడు. స్మిత్‌కు తిరిగి కెప్టెన్సీ దక్కే అవకాశముందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'అది చెప్పడం చాలా కష్టం. అతడు కెప్టెన్సీకి పోటీదారుడు కావొచ్చు. మేం అతడిపై మొగ్గు చూపుతామా లేదా అన్నది అలాంటి అవసరం రావడంపై ఆధారపడి ఉంటుంది. పైన్‌ ఇంకా నిష్క్రమించలేదు' అని చెప్పాడు.

ఇదీ చూడండి : కరోనా సోకిందని ఆట మధ్యలోనే తప్పించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.