ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్‌కు జరిమానా విధించింది ఐసీసీ. టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు, క్రమశిక్షణ చర్యలు కింద మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత వేసింది. అతడికి ఓ డీమెరిట్ పాయింట్‌ను కలుపుతున్నట్లు ప్రకటించింది.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 56 ఓవర్లో పుజారాకు వ్యతిరేకంగా తీసుకున్న రివ్యూను ఆసీస్ కోల్పోవడం వల్ల అంపైర్‌పై పైన్ అసహనం వ్యక్తం చేశాడు. పైన్ వ్యవహారశైలి సరిగ్గా లేని కారణంగా అతడిపై జరిమానా వేశారు. ఈ విషయంలో తన తప్పిదాన్ని ఇప్పటికే పైన్ అంగీకరించాడు.
ఇదీ చూడండి : రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా