పాకిస్థాన్ క్రికెటర్లను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా మరో ముగ్గురు యువ ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్ ఇందులో ఉన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు ఆటగాళ్లకు చేసిన టెస్టుల్లో భాగంగా ఈ ముగ్గురికి కరోనా నిర్ధరణ అయినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఆటగాళ్లను ఐసోలేషన్‌కు పంపించినట్లు వెల్లడించింది.