ఏఆర్ రెహమాన్ ఆలపించిన వందేమాతరం గీతం వింటుంటే ప్రతి భారతీయుడి తనువంతా దేశభక్తి భావంతో పులకించిపోతుంది. అదే వేల మంది ఒక్కసారిగా పాడుతుంటే ఎలా ఉంటుంది.. రోమాలు నొక్కబొడుచుకోవాల్సిందే. ఇదే సంఘటన అసోం గువాహటి బర్సాపారా స్టేడియంలో ఆవిష్కృతమైంది.
శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ కోసం బర్సాపారా జనంతో కిక్కిరిసిపోయింది. వర్షంతో మ్యాచ్ ఆలస్యమైన తరుణంలో ప్రేక్షకులంతా రెహమాన్ పాడిన వందేమాతరం గీతం ఆలపించడం మొదలుపెట్టారు. అది వింటున్నప్పుడు ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది బీసీసీఐ.
-
Guwahati, you beauty 😍#INDvSL pic.twitter.com/QuZAq7i1E3
— BCCI (@BCCI) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Guwahati, you beauty 😍#INDvSL pic.twitter.com/QuZAq7i1E3
— BCCI (@BCCI) January 5, 2020Guwahati, you beauty 😍#INDvSL pic.twitter.com/QuZAq7i1E3
— BCCI (@BCCI) January 5, 2020
అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండగా 6:30 గంటలకు టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. మ్యాచ్‌కు కాసేపటి ముందే వర్షం ప్రారంభమైంది. అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురవడం వల్ల పిచ్ చిత్తడిగా మారింది. మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపించలేదు. అనంతరం పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: నేను సెలక్టరైతే ధావన్‌ను తీసుకోను: శ్రీకాంత్