టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురింపించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై రోహిత్ చేసిన సెంచరీ.. తాను చూసిన అతడి వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమైనదని అన్నాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో గెలవడం జట్టులో సానుకూలతను నింపిందని చెప్పాడు.
"నేను ఇప్పటివరకు చూసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమైంది. ఒత్తిడిని తట్టుకుంటూ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇలా ఆడటం అతడికే సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్ కొన్నిసార్లు తొందరపడతారు. కానీ రోహిత్ మాత్రం చాలా పరిణితితో ఆడాడు." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
మ్యాచ్ మొత్తంలో 144 బంతులాడిన రోహిత్ శర్మ 122 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో 227 పరుగులే చేయగలిగింది. ముఖ్యంగా స్పిన్నర్లు చాహల్ నాలుగు వికెట్లు, కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. బుమ్రా, భువనేశ్వర్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇది చదవండి: సెంచరీతో పాటే రికార్డుల్ని కొట్టేశాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ