భారత్‌పై గెలవాలంటే పాకిస్థాన్ జట్టుకు 13 పరుగులు కావాలి. ఉన్నది ఒకటే ఓవర్, ఒకటే వికెట్. క్రీజులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్. అనామక బౌలర్ జోగిందర్ శర్మకు కెప్టెన్ ధోనీ బంతి అందించాడు. రెండో బంతికే మిస్బా సిక్స్ కొట్టడం వల్ల టీమ్ఇండియా శిబిరంలో ఆందోళన. మరుసటి బంతిని షార్ట్ లెగ్ దిశగా స్కూప్ చేశాడు మిస్బా. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. సరిగ్గా ఇది జరిగి నేటికి(సెప్టెంబరు 24) 13 ఏళ్లు.
-
THE DAY cricket revolution 2.0 began in India. #T20worldcup pic.twitter.com/RnlL5CFbZk
— Vibhinna Ideas (@Vibhinnaideas) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">THE DAY cricket revolution 2.0 began in India. #T20worldcup pic.twitter.com/RnlL5CFbZk
— Vibhinna Ideas (@Vibhinnaideas) September 24, 2020THE DAY cricket revolution 2.0 began in India. #T20worldcup pic.twitter.com/RnlL5CFbZk
— Vibhinna Ideas (@Vibhinnaideas) September 24, 2020
దక్షిణాఫ్రికాలో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం ఎదుర్కొవడం వల్ల సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు లేకుండానే, టోర్నీలో బరిలోకి దిగింది ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా.
ఫైనల్‌కు చేరే క్రమంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠ జట్లను ఓడించి భారత కుర్రాళ్లు ఔరా అనిపించారు. తుదిపోరులో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయారు.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్.. వికెట్లన్నీ కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇది చదవండి: 'పాక్‌తో మ్యాచ్‌లో కనురెప్ప వేయకుండా ధోనీ సరేనన్నాడు'