ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టులో... టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత జట్టు సారథి విరాట్ కోహ్లీకి ట్రోఫీ అందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఆ సమయంలో తీసకున్న ఓ చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు దాదా. అభిమానులను ఆకట్టుకున్న ఆ ఫొటోలో దాదా కాస్త సీరియస్ లుక్‌లో కనిపించాడు.
ఈ పోస్ట్‌పై ఆయన కుమార్తె సనా మాత్రం సరదాగా స్పందించింది. "మీకు నచ్చనిది ఏంటి?" అని దాదా కోపంపై వ్యంగ్యంగా సెటైర్ వేసింది. కూతురు పోస్టుకు స్పందించిన గంగూలీ... " నువ్వు మాట వినకుండా ఉండటమే" అని చమత్కరించాడు. వెంటనే ఆమె "మీ నుంచే నేర్చుకుంటున్నాను" అని రాసి స్మైలీ ఎమోజీ పెట్టింది. ఇన్‌స్టాలో తండ్రీకూతుళ్ల ఈ సరదా సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది.
భారత్- బంగ్లాదేశ్ డే/నైట్ టెస్టును బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ను సిద్ధం చేయడం నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు ఎన్నోపనులను చక్కగా పర్యవేక్షించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. టెస్టు చూడటానికి వచ్చిన అతిథులను గౌరవించాడు. మ్యాచ్ వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ పోరులో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇదీ చదవండి:ప్రతి టెస్టు మ్యాచ్‌కు ఇంతే ఆదరణ లభిస్తే...!