ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఆ జట్టు ప్రస్తుత సారథి టిమ్ పైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌కు మరోసారి సారథ్యం వహించాలనే వాంఛ స్మిత్‌కు ఇప్పటికీ ఉందని అన్నాడు. అందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పాడు.
2018లో బాల్‌టాంపరింగ్ వివాదంతో స్మిత్‌పై ఆటగాడిగా ఏడాది, కెప్టెన్‌గా రెండేళ్ల పాటు నిషేధం పడింది. అయితే 2020 మార్చితోనే ఆ గడువు ముగిసినా.. అతడిని సారథిగా పునర్నియమించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆసక్తి చూపలేదు.
అయితే భారత్‌తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పైన్‌ను తప్పిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై స్పందిస్తూ.. జట్టు మరింత మంది నాయకులను తయారు చేసే పనిలో ఉందని చెప్పాడు పైన్.
"కెప్టెన్సీ బాధ్యత కోసం అతడు ఆసక్తిగా ఉన్నాడు. అయితే వచ్చే 6 నెలల నుంచి ఏడాది లోగా ఆ అంశంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం జట్టులో నాయకులను దిద్దితీర్చే పనిలో ఉన్నాం. కెప్టెన్ రేసులో స్మిత్ కూడా ఉన్నాడు."
- టిమ్ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్
కమిన్స్‌కు దక్కేనా?
ఆసీస్ టెస్టు జట్టుకు ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్ కూడా సారథి రేసులో ఉన్నాడు. అయితే అతడి నాయకత్వంపై స్టీవ్ స్మిత్ సానుకూలంగా లేడు. ఫాస్ట్ బౌలర్లకు కెప్టెన్ బాధ్యత కఠినమైన వ్యవహారమని అన్నాడు.
ఇదీ చూడండి: 'టీమ్ఇండియా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలదు'