ETV Bharat / sports

'ఐపీఎల్ కోసం ధోనీ సాధన విభిన్నంగా సాగింది' - ఐపీఎల్ కోసం ధోనీ సాధన విభిన్నంగా సాగింది'

ఐపీఎల్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి విభిన్నంగా సన్నద్ధమయ్యాడని తెలిపాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా. మహీతో పాటు తాను, రాయుడు, మురళీ ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని చెప్పాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : Jun 2, 2020, 9:41 PM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్‌కు ఈసారి విభిన్నంగా సన్నద్ధమయ్యాడని సహచరుడు సురేశ్‌ రైనా తెలిపాడు. మహీ, రాయుడు, మురళీ, తాను ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని చెప్పాడు. లాక్‌డౌన్‌కు ముందు చెన్నైలో నిర్వహించిన శిబిరానికి వీరంతా హాజరయ్యారు.

ధోనీ
ధోనీ

"ధోనీ సాధన ఈసారి భిన్నంగా సాగింది. రాయుడు, మహీ భాయ్‌, మురళీ, నేనూ కలిసి ఒక బృందంగా సిద్ధమయ్యాం. చెన్నైలో ఉన్నప్పుడు ధోనీ 2-4 గంటలు సాధన చేసేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం అలసిపోలేదు. మహీ ఉదయం జిమ్‌లో కసరత్తులు చేసేవాడు. సాయంత్రం 3 గంటలు బ్యాటింగ్‌ సాధన చేసేవాడు. వరుసగా జిమ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సాధన చేస్తే మరుసటి రోజు శరీరమంతా బిగుతుగా అవుతుంది. అలాంటప్పుడు మన శరీరం కొద్దిగా నెమ్మదిస్తుంది. అప్పుడు మరింత కష్టపడాలి. మూడు గంటల శిక్షణ ఉంటే ఐదు గంటలు సాధన చేయాలి. అప్పుడే అలసట లేకుండా నాలుగు గంటలు మ్యాచ్‌ ఆడగలం."

-రైనా, టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్

"టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున మహీభాయ్‌తో కలిసి ఆడాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సాధన భిన్నంగా సాగింది. ఆయన ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకునేందుకు టోర్నీ త్వరగా ఆరంభం కావాలని కోరుకుంటున్నా. శిబిరంలో ప్రత్యక్షంగా నేనేం చూశానో అందరికీ తెలియాలని భావిస్తున్నా. ఎవరైనా కష్టపడి సాధన చేస్తే ప్రార్థనలు, ఆశీర్వాదాలు వాటి పనిచేస్తాయి" అని రైనా వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.