ETV Bharat / sports

ఈ దిగ్గజాల కోరిక తీరలేదు.. కల నెరవేరలేదు! - ప్రపంచకప్ ముద్దాడని డివిలియర్స్

వారు తమ జట్టు తరఫున అద్భుతంగా అడి ఉండొచ్చు. ఎన్నో మరపురాని రికార్డులు నెలకొల్పొచ్చు. లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించొచ్చు. కానీ వన్డే ప్రపంచకప్​ను మాత్రం ఒక్కసారైనా ముద్దాడలేకపోయారు. అది వారికి కలగానే మిగిలిపోయింది. అలాంటి కొందరు దిగ్గజాలు గురించి ఇందులో తెలుసుకుందాం.

The iconic players who did not receive the World Cup
ఈ దిగ్గజ ఆటగాళ్ల కోరిక తీరలేదు.. కల నెరవేరలేదు
author img

By

Published : Jun 8, 2020, 6:25 PM IST

ప్రపంచకప్​ను ముద్దాడాలనేది ప్రతి క్రికెటర్​ కల. అందుకోసం మైదానంలో చెమట చిందిస్తాడు. తన శక్తినంతా ధారపోస్తాడు. కానీ కొంతమందినే ఆ అవకాశం వరిస్తుంది. మరికొంతమందికి అది కలగానే మిగిలిపోతుంది. అలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ అద్భుత బ్యాటింగ్​తో అదరగొట్టినా, మెగాటోర్నీలో కప్పును అందుకోలేకపోయిన కొందరు దిగ్గజ క్రికెటర్ల గురించే ఈ ప్రత్యేక కథనం.

సౌరభ్​ గంగూలీ

సౌరభ్ గంగూలీ.. 1999 నుంచి 2007 వరకు మూడు ప్రపంచకప్​ల్లో భారత్​ తరఫున ఆడినా, కల మాత్రం తీర్చుకోలేకపోయాడు. 2003లో టోర్నీ ఫైనల్​కు వెళ్లినా, నిరాశే మిగిలింది. ఆ ఏడాది గంగూలీ మూడు శతకాలతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2007లో జరిగిన టోర్నీలో లీగ్​ దశలోనే భారత్​ ఇంటిముఖం పట్టింది. 2011లో టీమ్​ఇండియా ప్రపంచకప్​ సాధించినప్పటికీ గంగూలీ అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. మెగాటోర్నీలో 22 మ్యాచ్​లాడిన గంగూలీ.. 55.88 సగటుతో 1006 పరుగులు చేశాడు.

గంగూలీ
గంగూలీ

కుమార సంగక్కర

శ్రీలంక బ్యాట్స్​మన్ కుమార సంగక్కర.. మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్. నాలుగు ప్రపంచకప్​లు ఆడినా, జట్టును విజేతగా నిలపలేకపోయాడు. 2007, 2011 టోర్నీల్లో శ్రీలంక ఫైనల్​ చేరినా.. కప్​ను ముద్దాడలేకపోయింది. 2015 ప్రపంచకప్​లో క్వార్టర్స్​లో దక్షిణాఫ్రికాపై ఓటమి పాలైంది లంక. ఈ మ్యాచ్​ తర్వాత సంగక్కర ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 1996లో శ్రీలంక ​కప్​ గెలుచుకోగా.. అప్పటికి సంగక్కర అంతర్జాతీయ కెరీర్​ను ప్రారంభించలేదు.

సంగక్కర
సంగక్కర

బ్రియన్​ లారా

వెస్టిండీస్ ఆటగాడు బ్రియన్​ లారా.. టెస్టు క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఈ ఆటగాడు. ఆ స్థాయిలో కాకపోయిన వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. 299 పరిమిత ఓవర్ల మ్యాచ్​లాడి 10వేలకు పైగా పరుగులు చేశాడు. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించే లారా.. ప్రపంచకప్​ను మాత్రం అందుకోలేకపోయాడు. 1975, 1978 ప్రపంచకప్​ విజేతగా నిలిచిన విండీస్ ఆ తర్వాత టైటిల్​ను అందుకోలేదు.

బ్రియన్ లారా
బ్రియన్ లారా

జాక్వెస్ కలిస్​

దక్షిణాఫ్రికా క్రికెటర్ జాక్వెస్ కలిస్​.. ప్రపంచ క్రికెట్​లోని నాణ్యమైన ఆల్​రౌండర్లలో​ ఒకడు. సనత్ జయసూర్య తర్వాత టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లలో పదివేల పరుగులతో పాటు 250కు పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కలిస్​ రికార్డు సృష్టించాడు. 17 శతకాలు, 86 అర్ధ శతకాలు చేసిన ఇతడికీ ప్రపంచకప్​ కలగానే మిగిలిపోయింది. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నా.. దక్షిణాఫ్రికా ఒక్కసారైనా కప్​ గెలవలేకపోయింది.

కలిస్
కలిస్

ఏబీ డివిలియర్స్

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. బ్యాట్​తో మైదానం అన్నివైపులా చెలరేగి ఆడతాడు. ఇతడు వన్డేల్లో 53.50 సగటుతో 9,577 పరుగులు చేశాడు. అబ్బురపరిచే షాట్లతో ఈతరం బ్యాట్స్​మెన్​కు స్ఫూర్తినింపే ప్లేయర్​. 2015 ప్రపంచకప్​లో వెస్టిండీస్​తో జరిగిన లీగ్​ మ్యాచ్​లో 31 బంతుల్లో శతకం చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఫార్మాట్​ ఏదైనా బౌలర్లకు నిద్రపట్టనీయకుండా విధ్వంసం సృష్టించడంలో ఈ సఫారీ ఆటగాడు దిట్ట. అయితే సఫారీల ప్రపంచకప్​​ కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. 1996, 1999, 2015లో సెమీస్​ వరకు చేరిన ఈ జట్టు, ఫైనల్​కు మాత్రం వెళ్లలేకపోయింది.

డివిలియర్స్
డివిలియర్స్

షాహిద్ అఫ్రిది

పాక్ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిది.. 1996లో అంతర్జాతీయ కెరీర్​ను ప్రారంభించాడు. కానీ ప్రపంచకప్​ను ముద్దాడలేకపోయాడు. 37 బంతుల్లోనే వేగంవంతమైన శతకం చేసి రికార్డు ఇతడి పేరుమీదే ఉంది. బ్యాటింగ్​తో పాటు స్పిన్​ మాయాజాలంతోనూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేయగల సమర్థుడు అఫ్రిది. వన్డేల్లో 398 వికెట్లు తీసిన ఇతడికి ప్రపంచకప్ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయిది. 1992లో పాక్​ ప్రపంచకప్​ నెగ్గినా.. అప్పటికీ అఫ్రిది ఇంకా అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడటం ప్రారంభించలేదు.

అఫ్రిదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.