ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అలాగే అతడు ఐపీఎల్‌కూ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా తన గాయంపై స్పందించిన శ్రేయస్.. అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ సందేశం ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
-
I’ve been reading your messages and have been overwhelmed by all the outpouring of love and support. Thank you from the bottom of my heart to everyone. You know what they say, the greater the setback, the stronger the comeback. I shall be back soon ❤️🙏 pic.twitter.com/RjZTBAnTMX
— Shreyas Iyer (@ShreyasIyer15) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’ve been reading your messages and have been overwhelmed by all the outpouring of love and support. Thank you from the bottom of my heart to everyone. You know what they say, the greater the setback, the stronger the comeback. I shall be back soon ❤️🙏 pic.twitter.com/RjZTBAnTMX
— Shreyas Iyer (@ShreyasIyer15) March 25, 2021I’ve been reading your messages and have been overwhelmed by all the outpouring of love and support. Thank you from the bottom of my heart to everyone. You know what they say, the greater the setback, the stronger the comeback. I shall be back soon ❤️🙏 pic.twitter.com/RjZTBAnTMX
— Shreyas Iyer (@ShreyasIyer15) March 25, 2021
"మీరు చేసిన మెసేజ్‌లను చదివా. నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్వరలోనే దృఢంగా మళ్లీ తిరిగొస్తాను."
-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బెయిర్ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ డైవ్ చేయగా.. అతడి చేయి నేలను బలంగా తాకింది. శ్రేయస్ భుజం కొంతమేర డిస్లొకేట్ అయ్యింది. దీనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సమస్య తీవ్రమైతే ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.