ETV Bharat / sports

రోహిత్​.. ఎక్కడ ఆడతాడు? వేటు ఎవరిపై?

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియాకు మరో చిక్కొచ్చిపడింది. క్వారంటైన్​ ముగించుకుని, వైస్​ కెప్టెన్​గా నియమితుడైన రోహిత్​ శర్మను ఏ స్థానంలో ఆడించాలా అని? ఈ విషయమై మేనేజ్​మెంట్ ప్రస్తుతం ఆలోచన చేస్తోంది.

The dilemma of vice-captain Rohit Sharma's batting spot at SCG
రోహిత్​.. ఎక్కడ ఆడతాడు? వేటు ఎవరిపై?
author img

By

Published : Jan 3, 2021, 7:13 AM IST

ఐపీఎల్​-13లో గాయం.. ఆ తర్వాత దాన్నుంచి కోలుకోవడానికి జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) లో చేరడం వల్ల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్​తో పాటు తొలి రెండు టెస్టులకు రోహిత్​ శర్మ దూరమయ్యాడు. కంగారూ గడ్డపై అడుగుపెట్టాక 14 రోజుల క్వారంటైన్.. సాధనకు ఎక్కువ సమయం లేకపోవడం లాంటి కారణాల నేపథ్యంలో మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్పటిలోపు మ్యాచ్​ ఫిట్​నెస్​ సాధిస్తాడా? తిరిగి లయ అందుకుంటాడా? తుది జట్టులో అతడ్ని తీసుకుంటారా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పుజారా స్థానంలో రోహిత్​ను టెస్టు జట్టుకు వైస్ ​కెప్టెన్​గా నియమించడం వల్ల అతడు బరిలో దిగడం ఖాయమైంది.

ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నప్పటికీ.. ప్రాక్టీస్​ చేసుకునేందుకు ఎలాంటి అవాంతరం లేదు. కాబట్టి అతడు మూడో టెస్టు కచ్చితంగా ఆడనున్నాడు. మరి హిట్​మ్యాన్​ను ఏ స్థానంలో ఆడిస్తారు? అతడ్ని జట్టులోకి తీసుకునేందుకు ఎవరిపై వేటు వేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు చర్చంతా వీటి చుట్టూనే తిరుగుతోంది.

The dilemma of vice-captain Rohit Sharma's batting spot at SCG
రోహిత్​ శర్మ

వారిద్దరిలో ఒకరిపై వేటు!

రోహిత్​ జట్టులోకి రావాలంటే మయాంక్ అగర్వాల్​ లేదా హనుమ విహారిలో ఎవరో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. ఒకవేళ హిట్​మ్యాన్​ను ఓపెనర్​గానే కొనసాగించాలంటే మయాంక్​పై వేటు తప్పదు. గతంలో మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​గా టెస్టుల్లో గొప్పగా రాణించకపోవడం వల్ల.. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్​లో సుదీర్ఘ ఫార్మాట్​లోనూ అతడ్ని ఓపెనర్​గా పంపారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ అద్భుతంగా రాణించాడు. అయితే అది స్వదేశంలో కావడం.. విదేశాల్లో టెస్టుల్లో అతనికి ఓపెనర్​గా ఇంకా సవాలు ఎదురు కాకపోవడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం.

మరోవైపు చాలాకాలం తర్వాత అతడు టెస్టు ఆడబోతుండడం వల్ల నేరుగా ఓపెనర్​గా పంపితే.. ఆసీస్​ పిచ్​పై కొత్త బంతి సవాలును రోహిత్​ సమర్థంగా ఎదుర్కొంటాడా అన్నది సందేహంగా మారింది. అయినా ఫర్వాలేదు.. ఓపెనర్​గా అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకముంచి జట్టు తనతోనే ఇన్నింగ్స్​ ప్రారంభిస్తే మయాంక్ తప్పుకోవాల్సిందే!

నిపుణులు ఏమంటున్నారు?

విరామం తర్వాత ఆడుతున్నాడు కాబట్టి ఓపెనర్​గా కాకుండా మిడిలార్డర్​లో పంపాలని భావిస్తే విహారి బయట కూర్చోవాల్సిందే. అయితే మిడిలార్డర్​లో అతడి రికార్డు ఏమంత గొప్పగా లేదు. అయిప్పటికీ అప్పటికే బంతి పాతబడడం సహ పిచ్​పై ఓ అంచనాకు వచ్చే అవకాశముంది కాబట్టి అతడ్ని మిడిలార్డర్​లోనే పంపించాలని మాజీ సెలక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్, దిలీప్ వెంగ్​సర్కార్​ అంటున్నారు. అంతేకాకుండా రోహిత్​తో పాటు కేఎల్​ రాహుల్​ను జట్టులోకి తీసుకుని.. గిల్​, రాహుల్​ను ఓపెనర్లుగా పంపాలని దిలీప్​ చెప్పడం విశేషం. మరి ఈ పరిస్థితుల్లో జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇదీ చూడండి: 'మైదానంలో టీమ్‌ఇండియాకు బౌలింగ్​ సారథి అశ్విన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.