ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఈ విషయమై ట్విట్టర్లో ఓ ఫొటో పోస్ట్ చేయగా, స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్.. 'ఈ సాలా కప్ నమ్దే'(ఈ కప్ మనదే) అంటూ వారిని ట్రోల్ చేసింది. ప్రస్తుతం ఇది అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది.
అసలేం జరిగింది?
కరోనాతో విధించిన లాక్డౌన్ వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేశారు. దీంతో షెడ్యూల్ ప్రకారం జట్ల మధ్య 'ఇండియన్ పోల్ లీగ్' నిర్వహించింది ఆర్సీబీ. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు క్రికెట్ అభిమానులు. అయితే ఈ లీగ్ ఆసాంతం రాణించిన బెంగళూరు.. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడి 85 శాతం ఓట్లు సాధించి, విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేయగా, చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోలింగ్ చేసింది.
-
A big thank you to everyone who made RCB the champions of the #IndianPollLeague by voting consistently, every day for the last 55 days. In the final, #RCB beat #SRH with an incredible 8️⃣5️⃣% of the votes! 🏆 #PlayBold #InAParallelUniverse #ipl #Bestfans pic.twitter.com/1WBbU4WCU1
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A big thank you to everyone who made RCB the champions of the #IndianPollLeague by voting consistently, every day for the last 55 days. In the final, #RCB beat #SRH with an incredible 8️⃣5️⃣% of the votes! 🏆 #PlayBold #InAParallelUniverse #ipl #Bestfans pic.twitter.com/1WBbU4WCU1
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2020A big thank you to everyone who made RCB the champions of the #IndianPollLeague by voting consistently, every day for the last 55 days. In the final, #RCB beat #SRH with an incredible 8️⃣5️⃣% of the votes! 🏆 #PlayBold #InAParallelUniverse #ipl #Bestfans pic.twitter.com/1WBbU4WCU1
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2020
2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి కప్పు కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న ఆర్సీబీకి అది ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లోనూ చేతికి అందినట్టే అంది చేజారింది.
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే, ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.