భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ఆటగాళ్లకు యోయో పరీక్ష తప్పనిసరి. బీసీసీఐ ఈ నిబంధనను కొన్నేళ్ల ముందు ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచాలని నిర్ణయించిన బీసీసీఐ యోయోను మరింత కఠినతరం చేసింది. ఇంతకుముందులా 16:1 కాకుండా 17:1 ప్రమాణాన్ని అందుకోవాలి. 2 వేల మీటర్ల పరుగును కూడా ఫిట్‌నెస్‌కు ప్రమాణంగా పెట్టింది. తాము ఫిట్ అని నిరూపించుకోవడానికి ఈ రెండింట్లో ఒక దాన్ని క్రికెటర్లు పూర్తి చేయాల్సి ఉంది.
2 కి.మీ పరుగును పేసర్లు 8 నిమిషాల 15 సెకన్లలోనూ.. మిగిలినవాళ్లు 8 నిమిషాల 30 సెకన్లలోనూ పూర్తి చేయాలి. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో జాతీయ క్రికెట్ అకాడమీలో 20 మంది క్రికెటర్లకు కొత్తగా అమల్లోకి వచ్చిన ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. శాంసన్, నితీశ్ రాణా, తెవాతియా, ఇషాన్ కిషన్, సిద్ధార్థ్ కౌల్, ఉనద్కత్ విఫలమయ్యారు. శుక్రవారం మరోసారి పరీక్ష ఎదుర్కొన్న కిషన్, కౌల్, ఉనద్కత్ గట్టెక్కారు!
ఇదీ చదవండి: మీకెలాంటి మసాలా దొరకదు: రహానె