ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(44) ఔటైన విధానంపై దిగ్గజ ఓపెనర్ గావస్కర్ విమర్శలు చేశాడు. హిట్‌మ్యాన్ కొట్టిన షాట్‌ను బాధ్యతారహితమైనదని చెప్పాడు.
"ఎందుకు?ఎందుకు?ఎందుకు? నేను నమ్మలేకపోతున్నాను. అదో బాధ్యతారహితమైన షాట్. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఓ ఫీల్డర్ ఉన్నాడు. అంతకముందు రెండు బౌండరీలు బాది.. తర్వాత ఎందుకు ఆ షాట్ ఆడావు. నువ్వు సీనియర్ ఆటగాడివి. ఈ తప్పిదాన్ని ఉపేక్షించేదిలేదు. అనవసరంగా ఓ వికెట్ పోయింది"
-గావస్కర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్.. లైయన్ వేసిన ఓవర్లోని ఐదో బంతిని గాల్లోకి షాట్ కొట్టాడు. అది కాస్త స్టార్క్ చేతికి చిక్కింది. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం టీ విరామం తర్వాత వర్షం కారణంగా మూడో సెషన్ రద్దయింది. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ నిలిచిపోయింది.
ప్రస్తుతం టీమ్ఇండియా 62/2 స్కోరుతో ఉంది. క్రీజులో పుజారా(8), రహానె(2) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది.
ఇదీ చూడండి : భారత్-ఆసీస్ టెస్టు: మూడో సెషన్ వరుణుడిదే