థాయ్‌లాండ్... ఈ దేశం క్రికెట్ ఆడుతుందని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రికార్డు విజయాలు సొంతం చేసుకొంటుందని ఊహించి ఉండరు. ఒకటి కాదు.. రెండు కాదు వరుసగా 17 అంతర్జాతీయ టీ-20ల్లో విజయం సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా(16) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది థాయ్‌లాండ్ మహిళా క్రికెట్ జట్టు.
శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన టీ-20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు థాయ్‌లాండ్ అమ్మాయిలు. నాలుగు దేశాలు కలిసి ఆడుతున్న ఈ సిరీస్‌లో... ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట నెగ్గింది. థాయ్‌లాండ్‌తో పాటు నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 54 పరుగులకు ఆలౌటైంది. అనంతరం థాయ్‌లాండ్ కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నట్టాకమ్ చాంతమ్ 42 పరుగులు చేసి ఆకట్టుకుంది. థాయ్‌లాండ్ బౌలర్లలో నటాలియా 3 వికెట్లు తీసింది.
-
Most consecutive wins in all of T20I cricket:
— ICC (@ICC) August 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
THAILAND WOMEN: 17 👏
Australia Women: 16
Zimbabwe Women: 14*
England Women: 14
New Zealand & Australia Women: 12https://t.co/XU54CmaISv
">Most consecutive wins in all of T20I cricket:
— ICC (@ICC) August 11, 2019
THAILAND WOMEN: 17 👏
Australia Women: 16
Zimbabwe Women: 14*
England Women: 14
New Zealand & Australia Women: 12https://t.co/XU54CmaISvMost consecutive wins in all of T20I cricket:
— ICC (@ICC) August 11, 2019
THAILAND WOMEN: 17 👏
Australia Women: 16
Zimbabwe Women: 14*
England Women: 14
New Zealand & Australia Women: 12https://t.co/XU54CmaISv
గత ఏడాదే అరంగేట్రం..
థాయ్‌లాండ్ మహిళా జట్టు తన తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌ను... 2018 జూన్‌లో పాకిస్థాన్‌తో ఆడింది. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సొంతం చేసుకుంది. అంతేకాకుండా వాటిలో 17 మ్యాచ్‌లు వరుసగా నెగ్గడం రికార్డు. ఈ ఏడాదిలోనే వరుసగా 15 విజయాలు సొంతం చేసుకొంది.
శ్రీలంకనే ఓడించింది...
మహిళల టీ-20 ఆసియాకప్‌లో శ్రీలంకను ఓడించింది థాయ్‌లాండ్. 2018లో జరిగిన ఈ టోర్నీలో ఐసీసీ శాశ్వత సభ్యదేశంపై గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
ఆగ్నేయాసియా క్రీడల్లో స్వర్ణం..
ఆగ్నేయాసియా క్రీడల్లో స్వర్ణాన్ని సాధించింది థాయ్ మహిళా క్రికెట్ జట్టు. నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది.
పొట్టి ఫార్మాట్లో వరుసగా ఎక్కువ విజయాలు అందుకున్న దేశాల్లో థాయ్‌లాండ్(17) తర్వాత ఆస్ట్రేలియా(16), జింబాబ్వే(14), ఇంగ్లాండ్(14), న్యూజిలాండ్(12) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.