పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ బోర్డు. మూడు మ్యాచ్‌ల కోసం 14 మందితో జట్టును ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం టెస్టుల్లో ఆడుతున్న ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆగస్టు 28 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా పొట్టి సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లీష్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. మిడిల్‌ఎసెక్స్ ఆల్‌రౌండర్ లియామ్ డావ్సన్, జేమ్స్ విన్స్ ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు.
" ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లను బయో బబుల్ కారణంగా టీ20లకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టు మూడు రోజుల తర్వాత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మల్టీ ఫార్మాట్ ప్లేయర్లకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఇస్తున్నాం. త్వరలోనే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టును ప్రకటిస్తాం" అని సెలక్టర్ స్మిత్ చెప్పారు.
ఇంగ్లాండ్ జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, జో డెన్లే, లూయిస్ గ్రెగోరీ, క్రిస్ జోర్డాన్ష షకీబ్ మహ్మూద్, డేవిడ్ మాల్టన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లే
ప్రస్తుతం ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ నెగ్గగా.. రెెండో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. ఫలితంగా ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆగస్టు 21 నుంచి సౌథాంప్టన్‌లోనే ప్రారంభం కానుంది.