ETV Bharat / sports

అప్పుడు సచిన్​కు లారా-గేల్ ప్రత్యేక బహుమతి

author img

By

Published : Nov 17, 2020, 11:43 AM IST

క్రికెట్​కు వీడ్కోలు పలికిన సమయంలో సచిన్​కు విండీస్ దిగ్గజ ఆటగాళ్లు గేల్-లారా ప్రత్యేక బహుమతినిచ్చారు. ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న మాస్టర్.. ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Tendulkar reveals special gift Lara, Gayle presented him
సచిన్​కు వెస్టిండీస్​ క్రికెటర్ల ప్రత్యేక బహుమతి

అంతర్జాతీయ క్రికెట్​కు సచిన్​ తెందుల్కర్​ వీడ్కోలు​ పలికి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్... వెస్టిండీస్​పై భారత్​ తరపున ఆడిన చివరి టెస్టు తర్వాత బ్రియాన్​ లారా, క్రిస్​ గేల్​ తనకు ప్రత్యేక బహుమతిని అందించారని చెప్పాడు.

"సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్​ జట్టుతో పాటు నా స్నేహితులైన బ్రియాన్​ లారా, క్రిస్​ గేల్​ ఈ అందమైన స్టీల్​ డ్రమ్​ను నాకు బహుకరించారు. ఇలాంటి అద్భుతమైన బహుమతికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. వారి ప్రేమా అభిమానాలకు, బీసీసీఐ ధన్యావాదాలు"

- సచిన్​ తెందుల్కర్​, దిగ్గజ క్రికెటర్​

బ్రియాన్​ లారా తన ఇంటికి వచ్చినప్పుడు డ్రమ్​ను వాయించాడని సచిన్​ తెలిపాడు. లారాను అనుసరిస్తూ డ్రమ్​ను మోగిస్తున్నానని తెలిపాడు.

2013 నవంబరు 16న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్​పై సచిన్​ తన చివరి, 200వ టెస్టు​ ఆడాడు. ఈ మ్యాచ్​ అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మాస్టర్​ ప్రకటించాడు. ఈ పోరులో మాస్టర్​ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్​లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు. ఈ క్రమంలోనే చేసిన​ అతడి ప్రసంగం క్రికెట్​ అభిమానుల మదిలో ఎప్పటికీ అలానే నిలిచిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.