ETV Bharat / sports

100మంది చిన్నారులకు సచిన్​ వైద్యసాయం - సచిన్​ తెందుల్కర్​

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 100మంది చిన్నారులకు వైద్యసాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఆ బాధితుల చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును సచిన్​ భరించనున్నాడు.

sachin
సచిన్​
author img

By

Published : Nov 30, 2020, 10:20 PM IST

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ మరోసారి తన దాతృత్వాన్ని చాటాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 100మంది చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ఎకాం ఫౌండేషన్​ ద్వారా వారి చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును సచిన్​ భరించనున్నాడు. ఈ చిన్నారి బాధితులు మహారాష్ట్ర, బంగాల్​, అసోం, కర్ణాటక, తమిళనాడు, అంధ్రప్రదేశ్​ రాష్ట్రాలకు చెందినవారు.

ఇటీవల అసోంలోని ముకుంద ఆస్పత్రికి వైద్యపరికరాలను విరాళంగా ఇచ్చాడు సచిన్​. దీని ద్వారా 2వేల మంది చిన్నారులకు ప్రయోజనం కలుగనుంది.

ఇదీ చూడండి : 4000 మందికి అండగా దిగ్గజ సచిన్ తెందుల్కర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.