తన క్రీడా జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపించే వారిలో ముందుంటాడు టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. మైదానంలో తనకు తగిలిన గాయాలపై, వాటి నుంచి కోలుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. క్రీడాగాయాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 వేల మంది యువ వైద్యులతో తన అనుభవాలను పంచుకున్నాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో పాటు తనను ఎక్కువగా బాధ పెట్టిన మోచేతి గాయం గురించి వారితో చర్చించాడు.
చికిత్సలో వ్యత్యాసం
కీళ్లవ్యాధి నిపుణుడు సుధీర్ వారియర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ వైద్యులతో క్రీడా గాయలపై చర్చించారు. కరోనా లాక్డౌన్ కారణంగా వీడియోకాల్ ద్వారా గాయాలపై సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న కీళ్లవ్యాధి నిపుణులు.. క్రీడాకారులకు ఎటువంటి చికిత్సను అందించాలనే వివరాలతో పాటు సాధారణ రోగుల కంటే భిన్నంగా ఎలా ఉంటారో తెలుసుకున్నామన్నారు.
డాక్టర్ సుధీర్ వారియర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీమ్ఇండియా, ముంబయి ఇండియన్స్‌కు ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసిన నితిన్ పటేల్ కూడా ఇందులో పాల్గొన్నాడు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది: అజారుద్దీన్