బాల్ టాపంరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న స్టీవ్ స్మిత్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు శతకాలు బాది ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
జట్టులోకి పునరాగమనం తర్వాత అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. 6 వికెట్లతో రాణించిన లయన్‌ను, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి విజయం సాధించిన కంగారూ జట్టునూ అభినందించాడు.
" స్మిత్ బాగా ఆడావ్. టెస్టు క్రికెట్లోకి మంచి ఇన్నింగ్స్‌తో పునరాగమనం చేశావు. పదునైన బంతులతో లయన్ బయపెట్టాడు. తొలి టెస్ట్ గెలిచిన ఆసీస్ జట్టుకు అభినందనలు".
-- సచిన్ తెందూల్కర్
యాషెస్ తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై 251 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ ఐదు రోజుల ఆటలో స్మిత్... రెండు ఇన్నింగ్స్‌లలో 144, 142 పరుగులు చేశాడు. ఫలితంగా ఒక టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు స్టీవ్ స్మిత్.
ఇదీ చూడండి: 'బ్యాడ్మింటన్ చూడటమే కాదు.. ఆడటమూ పెరగాలి'