తన కెరీర్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ అని చెప్పాడు ఆసీస్ మాజీ సారథి మైకెల్ క్లార్క్. దీనితో పాటే టీమిండియా సారథి విరాట్ కోహ్లీపైనా ప్రశంసలు కురిపించాడు.
"నేను చూసిన వారిలో సచిన్ తెందుల్కర్, సాంకేతికంగా ఒక్క బలహీనత లేని అత్యుత్తమ బ్యాట్స్‌మన్. తనకు తానుగా ఔటవ్వలి లేదంటే అతడిని పెవిలియన్‌కు పంపడం చాలా కష్టం. ప్రస్తుతమైతే కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నాడు. అయితే వీరిద్దరికి ఉన్న ఏకైక లక్షణం సెంచరీలు బాదడం"
-మైకెల్ క్లెర్క్,ఆసీస్ మాజీ కెప్టెన్
కెరీర్లో 200 టెస్టులాడి, 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్. దీనితో పాటే టెస్టు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. 2013లో వెస్టిండీస్‌పై చివరి మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ తీసుకున్నాడు లిటిల్ మాస్టర్.
ఇదీ చూడండి : 'ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ ఆడేందుకు నేను సిద్ధం'