ETV Bharat / sports

క్రికెట్​లో పెరుగుతున్న తెలుగు ముచ్చట్లు

ఇటీవల కాలంలో క్రికెట్​ మైదానంలో తెలుగు పలుకులు పెరుగుతున్నాయి. వార్నర్ 'బుట్టబొమ్మ' డ్యాన్స్, హనుమ విహారి మైదానంలో తెలుగులో మాట్లాడటమే ఇందుకు ఉదాహరణలు.

telugu talk in international cricket, mostly in australia tour
క్రికెట్​లో పెరుగుతున్న తెలుగు ముచ్చట్లు
author img

By

Published : Jan 11, 2021, 7:01 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లో తెలుగు ముచ్చట్లు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన​ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎవరెవరు తెలుగులో మాట్లాడారు?

'బుట్టబొమ్మ'కు వార్నర్ డ్యాన్

నవంబరు 27న భారత్xఆస్ట్రేలియా తొలి వన్డే జరుగుతోంది. వార్నర్​ బౌండరీ లైన్​ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. వీక్షకుల్లో ఒకరు 'వార్నర్ బుట్టబొమ్మ.. వార్నర్ బుట్టబొమ్మ' అని అరిచాడు. దీంతో నిల్చున్న చోటే చేతులు కదుపుతూ వార్నర్ స్టెప్పులు వేశాడు. దీంతో సినీ, క్రికెట్​ అభిమానులు ఫుల్​ ఖుషీ అయిపోయారు. అయితే ఈ మ్యాచ్​లో 66 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓడిపోయింది.

విహారి తెలుగు సంభాషణ

బాక్సింగ్​ డే టెస్టు సందర్భంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్​ సాగుతోంది. బౌండరీ లైన్​ దగ్గరున్న భారత క్రికెటర్ హనుమ విహారి.. స్టాండ్స్​లో ఉన్న అభిమానితో తెలుగులో మాట్లాడాడు. 'తొందరగా ఔట్ చేయండి' అన్న అంటూ విహారికి వినిపించేలా ఓ అభిమాని అరిచాడు. 'ఔట్ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా' అని సదరు ఆటగాడు బదులిచ్చాడు. ఈ మ్యాచ్​లో ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్​ఇండియా గెలిచింది.

మూడో టెస్టులోనూ తెలుగు డైలాగ్

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ విహారిని తెలుగులోనే ప్రోత్సాహించాడు అశ్విన్. 'ఆడు మామ ఆడు' అని అన్నాడు. ఈ మాటలు స్టంప్స్​కు ఉన్న మైక్​లో రికార్డయ్యాయి. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

మాజీ క్రికెటర్ భోగ్లే తెలుగు ట్వీట్

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​ చక్కటి డిఫెన్స్​తో ఆకట్టుకున్న హనుమ విహారిని మెచ్చుకున్నాడు మాజీ క్రికెటర్ హర్ష భోగ్లే. అందరిలా కాకుండా 'విజయలక్ష్మిగారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' అని ట్వీట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.