టీమిండియాలో పలు సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ విషయంపై ఆటగాళ్లు మరింత శ్రద్ధపెట్టాలని సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న యోయో టెస్టు స్కోరు 16.1ని శాస్త్రి పెంచే ఉద్దేశంతో ఉన్నాడట.
పోటీ కారణమా...?
జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు చాలా మంది యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఐపీఎల్ తర్వాత పోటీ పడేవారి సంఖ్య మరీ పెరిగింది. అయితే జాతీయ జట్టుకు సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం కాస్త కష్టంగా మారింది. అందుకే ఇకపై ఆటతో పాటు ఫిట్నెస్పైనా మరింత దృష్టి పెట్టనున్నారు.
ఇప్పటివరకు యోయో టెస్టులో పాసైన ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కేందుకు ఎక్కువ అవకాశముంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత స్కోరును 17కు పెంచాలని రవిశాస్త్రి బృందం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు అంటున్నాయి. త్వరలోనే బీసీసీఐ, ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చిస్తారట. దక్షిణాఫ్రికా సిరీస్‌తోనే ఈ నిబంధన అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
'రెండోసారి' బాధ్యతలు పెరిగాయి..!
ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత విమర్శలు మూటగట్టుకున్న రవిశాస్త్రి... రెండోసారి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తాజాగా తన పంథా మార్చుకున్నాడు. రానున్న అంతర్జాతీయ టోర్నీలను దృష్టిలో పెట్టుకొని యువకులకు అవకాశాలిచ్చేందుకు వ్యూహాలు సిద్ధంచేస్తున్నాడు. ఇందులో భాగంగానే యోయో అర్హత స్కోరు పెంచాలని కోరుతున్నాడట.
మిగతా దేశాల్లో...
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల యోయో స్కోరును 19 పాయింట్లు. దక్షిణాఫ్రికా 18.5, శ్రీలంక 17.4, పాకిస్థాన్ 17.4 పాయింట్ల స్కోరుతో ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఈ టెస్టును నాలుగేళ్ల నుంచి పరిగణనలోకి తీసుకోవట్లేదు.
ఇదీ చదవండి...