ETV Bharat / sports

భారత్​ టెస్టు ఛాంపియన్​షిప్​ ర్యాంక్​పై ప్రత్యర్థుల కన్ను! - టెస్టు ఛాంపియన్​షిప్​ భారత్​ అగ్రస్థానం

టీమిండియాతో ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసిన కివీస్​.. టెస్టు ర్యాంకింగ్స్​లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత జట్టును అందుకునేందుకు కేవలం 6 పాయింట్ల దూరంలో నిలిచింది. అంతేకాకండా టెస్టు ఛాంపియన్​షిప్​లోనూ భారత్​కు కివీస్​ సహా మరో రెండు దేశాల నుంచి పోటీ ఎదురుకానుంది.

Team India will face challenges in  World Test Championship for protecting no.1 rank?
టెస్టు ఛాంపియన్​షిప్​పైనా కన్నేసిన న్యూజిలాండ్​
author img

By

Published : Mar 4, 2020, 9:00 AM IST

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఓడిపోయిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో స్థానం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. భారత్​ స్థానానికి ఎసరు పెట్టేందుకు న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా ఎదురుచూస్తున్నాయి.

భారత్​ బలమైన ప్రత్యర్థులతో..

టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్​ అగ్రస్థానంలో ఉంటే మురిసిపోయాం. కానీ ఆ ర్యాంక్​ను కాపాడుకోవడానికి కోహ్లీసేన తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ సేన ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా 4 సిరీస్​లు ఆడేసింది. కానీ పట్టికలో 360 పాయింట్లే చేరాయి. మరో రెండు సిరీస్​లు మాత్రమే భారత్​కు మిగిలి ఉన్నాయి. ఇందులో 240 పాయింట్ల కోసం బలమైన జట్లయిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో పోటీపడనుంది. వీటిల్లో గెలిచినా, డ్రా చేసుకున్నా టాప్​-2లో భారత్​ నిలవచ్చు. ఓడితే మాత్రం పరిస్థితులు మారే అవకాశాలున్నాయి.

World Test Championship
ఇప్పటికే నాలుగు సిరీస్​లు ఆడేసిన భారత్​

వరుసగా భారత్​ తర్వాతి స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా(296), న్యూజిలాండ్​(180), ఇంగ్లాండ్​(146)తో మనకు చిక్కులు తప్పవు. ఈ మూడు జట్లు దాదాపు చిన్నజట్లపై రెండేసి సిరీస్​లు బాకీ ఉన్నాయి. కోహ్లీసేన మాత్రం ఆస్ట్రేలియాతో 4 టెస్టులను వారి సొంతగడ్డపై, 5 టెస్టులను ఇంగ్లాండ్​తో స్వదేశంలోనూ ఆడనుంది. ఈ రెండూ భారత్​కు దీటైన పోటీ ఇవ్వగల ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఇది పెద్ద సవాలే. టాప్​-2లో నిలిస్తేనే ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత సాధిస్తుంది 'మెన్​ ఇన్​ బ్లూ'.

ఐసీసీ ర్యాంకింగ్స్​పైనా కివీస్​ కన్ను...

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో చిత్తుగా ఓడినప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి ఢోకా లేకపోయింది. టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్​లోనే భారత్‌ కొనసాగుతోంది. అయితే తర్వాతి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు, టీమిండియాకు మధ్య అంతరం మాత్రం బాగా తగ్గింది. భారత్‌ 116 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌ 110 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానంలో, ఇంగ్లాండ్‌ 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

Team India will face challenges in  World Test Championship for protecting no.1 rank?
ఐసీసీ టెస్టు జట్ల ర్యాంక్​లు

కివీస్‌తో సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్‌ కోహ్లీ (4 ఇన్నింగ్స్‌ల్లో 38 పరుగులు) ర్యాంకులోనూ మార్పు లేదు. అతను రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడి ఖాతాలో 886 పాయింట్లున్నాయి. అగ్రస్థానంలో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (911)కు, విరాట్‌కు మధ్య అంతరం పెరిగింది. లబుషేన్‌ (827), విలియమ్సన్‌ (813) వరుసగా మూడు, నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి బుమ్రా (7) ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.