ETV Bharat / sports

బాక్సింగ్ డే టెస్టు: ఆ ఘనత సాధించిన తొలి జట్టు భారత్ - బాక్సింగ్ డే టెస్టు టీమ్ఇండియా రికార్డులు

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​ ద్వారా పలు ఘనతల్ని కైవసం చేసుకుంది. అవేంటో చూద్దాం.

Team India records in the Melbourne Test against Australia
బాక్సింగ్ డే టెస్టు
author img

By

Published : Dec 29, 2020, 12:02 PM IST

Updated : Dec 29, 2020, 3:07 PM IST

టీమ్‌ఇండియా ఎట్టకేలకు 2020లో తొలి టెస్టు విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్‌ ఆ తర్వాత 9 నెలలు టెస్టులే ఆడలేదు. ఐపీఎల్‌ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన భారత్‌ ఇటీవల అడిలైడ్‌ టెస్టులోనూ ఘోర పరాభవం పాలైంది. ఆ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యంలో నిలిచినా మూడో రోజు అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 స్కోర్‌ సాధించి టెస్టు చరిత్రలో అవమానకరమైన రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది.

బాక్సింగ్ డే టెస్టు.. పలు ఆసక్తికర అంశాలు

  • విదేశాల్లో భారత్‌కిది 52వ టెస్టు విజయం. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో ఆడిన 50 టెస్టుల్లో ఇది ఎనిమిదో విజయం. మొత్తంగా కంగారూలపై ఆడిన 100 మ్యాచ్‌ల్లో 29వ గెలుపు
  • విదేశాల్లో మెల్‌బోర్న్‌లోనే భారత్‌ అత్యధికంగా 4 టెస్టుల్లో విజయం సాధించింది. ఇంతకుముందు 1978, 1981, 2018లో భారత్‌ ఈ మైదానంలో గెలుపొందింది. ఆ తర్వాత పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, కింగ్‌స్టన్‌, కొలంబో మైదానాల్లో మూడు విజయాలు సాధించింది.
  • 1996 నుంచి జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మొత్తం 50 టెస్టులు జరగ్గా భారత్‌ 21 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఆస్ట్రేలియా 19 గెలవగా 10 టెస్టులు డ్రా అయ్యాయి.
  • గత పదేళ్లలో భారత్‌ 3 బాక్సింగ్‌ డే టెస్టులు ఆడగా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2010లో తొలిసారి ధోనీ సారథ్యంలో డర్బన్‌లో 87 పరుగులతో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్‌ తర్వాత రహానె నేతృత్వంలో ఈరోజు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
  • ఈ శతాబ్దంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 22 టెస్టులు ఆడగా 5 మ్యాచ్‌లు గెలుపొందింది. అలాగే ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో 21 టెస్టులు ఆడగా 4 గెలిచింది.
  • టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌ చరిత్రలో కనీసం 100 వికెట్లు తీసిన వారిలో రవీంద్ర జడేజాకు మించిన అత్యుత్తమ బౌలింగ్‌ సగటు 24.48 ఎవరికీ లేదు. ఈ మ్యాచ్‌లో అతడు 3 వికెట్లు పడగొట్టాడు.
  • ఆస్ట్రేలియా 100 ఓవర్లలో 200 పరుగుల స్కోర్‌ సాధించకపోవడం ఈ దశాబ్దంలో ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 100 ఓవర్లకు 196/9తో నిలిచింది. చివరికి 103 ఓవర్లలో 200 పరుగులు చేరుకుంది.
  • 2013 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఎక్కువ టెస్టులు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. కంగారూల గడ్డపై భారత్ 3 మ్యాచ్​లు గెలవగా, దక్షిణాప్రికా రెండు టెస్టుల్లో విజయం సాధించింది.
  • ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువ టెస్టులు గెలిచిన ఆసియా జట్టు కూడా భారతే కావడం గమనార్హం. అక్కడ ఇప్పటివరకు టీమ్ఇండియా 8 టెస్టుల్లో గెలవగా పాకిస్థాన్ నాలుగు మ్యాచ్​ల్లో విజయం సాధించింది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
  • ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన గత ఆరు టెస్టుల్లో భారత్ తరఫున పుజారా, కోహ్లీ, పంత్, రహానే సెంచరీలు సాధించగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్కరు కూడా శతకాలు బాదలేకపోయారు.

ఇవీ చూడండి: టీమ్ఇండియా విజయం.. నెట్టింట అభినందనల వెల్లువ

Last Updated : Dec 29, 2020, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.