టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ నుంచే విధ్వంసకర ప్రదర్శన చేస్తోంది. ఈ మెగాటోర్నీలో భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి.. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
మెల్బోర్న్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. టీమిండియా 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లో 46 పరుగులు(4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు బ్యాటింగ్‌లో రాణించింది. తన మెరుపు సిక్సర్లతో.. అన్నా పీటర్సన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డునూ బ్రేక్ చేసింది. సహా బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నా.. బెరుకు లేకుండా 14వ ఓవర్ల వరకు పోరాడిందీ 16 ఏళ్ల యువతి.
"పవర్‌ప్లేలోనే పరుగులు సాధించటం చాలా సంతోషాన్నిచ్చింది. బౌలర్ ఎప్పుడు తప్పిదం చేస్తారా అని ఎదురు చూశాను. వాళ్లు వేసిన స్లో బంతుల్ని ఎదుర్కోవటంలో విజయం సాధించాను. వీటన్నిటికి కారణం నేను అబ్బాయిలతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేయటమే. శిక్షణలో సహకరించినందరికి నా కృతజ్ఞతలు."
- షెఫాలీ వర్మ, టీమిండియా క్రికెటర్
-
No player has ever scored more runs at a higher strike rate at a single Women's #T20WorldCup than Shafali Verma in 2020 (114 runs at 172.72)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Superstar 🤩#INDvNZ pic.twitter.com/l9SWDWUP5c
">No player has ever scored more runs at a higher strike rate at a single Women's #T20WorldCup than Shafali Verma in 2020 (114 runs at 172.72)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020
Superstar 🤩#INDvNZ pic.twitter.com/l9SWDWUP5cNo player has ever scored more runs at a higher strike rate at a single Women's #T20WorldCup than Shafali Verma in 2020 (114 runs at 172.72)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020
Superstar 🤩#INDvNZ pic.twitter.com/l9SWDWUP5c
అత్యధిక రన్‌రేట్
ఈ టోర్నీలో వరుసగా రెండోసారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికైంది షెఫాలీ. తనపై నమ్మకంతో ప్రోత్సహించిన తండ్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 114 పరుగులు చేసింది. ఈ యువ క్రీడాకారిణి 172.72 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఫలితంగా టీ20ల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించిన మొదటి మహిళగా ఘనత సాధించింది.
పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆమె 147.97 స్ట్రైక్‌రేట్‌తో 438 పరుగులు చేసింది. క్లోయి ట్రయాన్ 138.31 (722 పరుగులు), అలిసా హేలీ 129.66 (1,875) స్ట్రైక్‌రేట్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కనీసం 200 పరుగులను ఈ గణాంకాలకు ఆధారంగా చేసుకున్నారు.
మూడో మ్యాచ్‌లోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌వుమన్ నుంచి మరోసారి నిరాశ ఎదురైంది. వారి వైఫల్యం కారణంగా భారత్ 20 ఓవర్లకు కేవలం 133 పరుగులతోనే సరిపెట్టుకుంది. కానీ, ప్రత్యర్థి లక్ష్యాన్ని చేరుకోకుండా స్పిన్నర్లు బాగా ఉపయోగపడ్డారు. గ్రూప్-ఎ మ్యాచ్‌ల్లో భాగంగా ఫిబ్రవరి 29న భారత్ - శ్రీలంక మధ్య పోరు జరగనుంది.
ఇదీ చూడండి.. కివీస్‌పై గెలుపుతో ప్రపంచకప్ సెమీస్‌కు భారత్