టీంఇండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలొచ్చాయి. త్వరలోనే వన్డే ప్రపంచకప్ ఆడబోతున్న నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త జెర్సీలు రూపొందించింది. మహిళా క్రికెటర్లకు కూడా కొత్త జెర్సీలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ స్పోర్ట్స్ యాక్ససరీస్ సంస్థ నైక్ .. భారత క్రికెట్ క్రీడాకారుల కోసం నూతన వన్డే కిట్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
నీలి రంగులోనే రెండు షేడ్స్‌తో జెర్సీలు డిజైన్ చేశారు. ముందు భాగంలో ఒప్పో, ఇండియా అని పెద్ద అక్షరాలతో ఉంది. ఈ కార్యక్రమంలో కోహ్లి, మాజీ సారథి ధోని, అజింక్యా రహానె, పృథ్వీ షా, మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ సింగ్, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు.
టీమ్‌ఇండియా జెర్సీని ఒంటిపై ధరించాలంటే అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉండాల్సిందేనని కోహ్లీ తెలిపాడు. నిరంతర శ్రమతో ఉత్తమ ప్రతిభ కనబరచాలని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం భారత జట్టు అత్యుత్తమంగా ఉందని, నిలకడైన ప్రదర్శన కనబరుస్తోందని ధోని తెలిపాడు.
క్రీడాకారులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఈ జెర్సీలను రూపొందించినట్టు నైక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ అధిపతి తెలిపారు.