టీమ్ఇండియా ప్రస్తుతం ఫీల్డింగ్‌లో తగిన ప్రదర్శన చేయడం లేదన్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. యువరాజ్ సింగ్, తాను కలిసి గతంలో ఫీల్డింగ్‌లో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచామని తెలిపాడు. అయితే ఇది ప్రస్తుత జట్టులో మందగించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మైదానంలో బంతి ఎటునుంచి వచ్చినా దాన్ని అందుకోగల సామర్థ్యం ఆటగాళ్లలో ఉండాలన్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు స్లిప్‌లో క్యాచ్‌లను అవలీలగా పట్టుకుంటున్నాడని చెప్పాడు. క్రీడాకారుడిగా జడేజా రోజురోజుకీ మరింత మెరుగవుతున్నాడని మహ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు.
"ఒక బ్యాట్స్‌మన్ కట్ షాట్, హుక్ షాట్, పుల్‌షాట్, బౌన్సర్‌కు ఆడటం, ఇన్‌స్వింగ్ డెలివరీని సమర్ధవంతంగా ఎదుర్కొంటే వారిని గ్రేట్ బ్యాట్స్‌మన్ అంటాం. అలానే ఫీల్డింగ్‌లో కూడా అన్ని రకాల నైపుణ్యం ఉంటేనే అతడు కంప్లీట్ ఫీల్డర్ అవుతాడు."
-కైఫ్, టీమ్ఇండియా మాజీ ఆటగాడు
"యువరాజ్ కాకుండా మీకు తెలిసిన ఉత్తమ ఫీల్డర్లు ఉన్నారా" అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అని సమాధానమిచ్చాడు కైఫ్. అతడు బుల్లెట్‌లాగా క్యాచ్‌లు పడతాడని ప్రశంసించాడు.
ఇదీ చూడండి.. 'ఆసీస్‌కు అగ్రస్థానమా.. ఎలా సాధ్యం'