బ్రిస్బేన్లో టీమ్ఇండియా ఉంటున్న హోటల్లో కఠిన క్వారంటైన్ నిబంధనలను విధించారు. ఆ పక్కనే ఉన్న మరో హోటల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసు బయటపడింది. దీంతో భారత క్రికెటర్లు, సిబ్బంది మరిన్ని ఆంక్షల నడుమ బసచేస్తున్నారు.
జనవరి 15న ప్రారంభమయ్యే నాలుగో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్ వెళ్లింది టీమ్ఇండియా. కరోనా కేసులు వెలికిచూసిన గ్రాండ్ ఛాన్సెలర్ హోటల్లోని అతిథులను క్వీన్స్లాండ్ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లోని హోటల్లలోకి తరలించింది .
భారత క్రికెటర్లు ఉంటున్న హోటల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది. జిమ్, స్విమ్మింగ్పూల్లను కూడా వాడుకోనివ్వడంలేదని పేర్కొంది. అయితే క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని సీఏ హామీ ఇచ్చింది.
ఇదీ చూడండి: ఆసీస్తో నాలుగో టెస్టుకు అందుబాటులో సెహ్వాగ్!