ETV Bharat / sports

'పింక్​బాల్​తో టీమ్​ఇండియా జాగ్రత్తగా ఉండాలి' - బౌలర్ స్పాన్

ప్రతిష్ఠాత్మక బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో తొలిపోరుకు రంగం సిద్ధమైంది. అడిలైడ్​ వేదికగా తొలి డే/నైట్​ మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సన్నద్ధత గురించి భారత మాజీ క్రికెటర్​ వెంకటపతిరాజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్​ అవుతుందని ఆయన అంటున్నారు.

team india former cricketer venkatpathi raju about australia tour and team india
'పింక్​బాల్​తో టీమ్​ఇండియా జాగ్రత్తగా ఉండాలి'
author img

By

Published : Dec 17, 2020, 8:00 AM IST

Updated : Dec 17, 2020, 8:39 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో గులాబి బంతితో టీమ్​ఇండియా ఆడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు. పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుందని చెప్పారు. కరోనా కారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్​కు దూరమయ్యారని.. అయినా ప్రస్తుత టీమ్ ఫిట్​గానే ఉందన్నారు. విజయవాడలో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. 'ఈటీవీ భారత్​'తో మాట్లాడారు.

'పింక్​బాల్​తో టీమ్​ఇండియా జాగ్రత్తగా ఉండాలి'

ఐపీఎల్, టెస్ట్, వన్డే, టీ-20ల ఫార్మాట్లకు తగ్గట్లుగా ఆటగాళ్లను ఎంపిక చేస్తుండాలని వెంకటపతిరాజు సూచించారు. ఒకప్పుడు బౌలర్ స్పాన్ ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు ఫార్మాట్లు పెరగడం వల్ల తగ్గుతోందని తెలిపారు.

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ తొలి డే/నైట్​ మ్యాచ్​ ప్రారంభం కానుంది. పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఇంతవరకూ ఓటమే ఎరుగని ఆస్ట్రేలియాతో భారత్​ అమీతుమీ తేల్చుకోనుంది.

ఇదీ చూడండి: భారత్​Xఆస్ట్రేలియా: పింక్​బాల్​ టెస్టులో పైచేయి ఎవరిది?

Last Updated : Dec 17, 2020, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.