బంగ్లాదేశ్ అభిమానుల నుంచి మాత్రమే తమకు మద్దతు లభించదని తెలిపాడు రోహిత్ శర్మ. వేరే ఏ దేశంలో ఆడినా తమకు మద్దతిచ్చే అభిమానులు ఉంటారని అన్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌తో ఫేస్బుక్ లైవ్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ పలు విషయాలను పంచుకున్నాడు.
"మేము ఏ దేశంలో పర్యటించినా మాకు మద్దతు లభిస్తుంది. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రమే మాకెలాంటి సపోర్ట్ ఉండదు. బంగ్లా ఫ్యాన్స్ అందరూ మీ వెనక ఉంటారు. ప్రస్తుతం బంగ్లా జట్టు బలంగా ఉంది."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మకు బంగ్లాదేశ్‌పై మంచి రికార్డుంది. 2015 ప్రపంచకప్, ఛాంపియన్ ట్రోఫీ-2017, 2019 ప్రపంచకప్‌ల్లో ఈ జట్టుపై శతకాలు సాధించాడు హిట్‌మ్యాన్. ఈ సెంచరీలు నాకౌట్ దశలో బంగ్లాను కట్టడి చేసేందుకు ఉపయోగపడ్డాయి. కొన్నేళ్లుగా భారత్-బంగ్లా మధ్య పోరు రసవత్తరంగా మారిందనడంలో సందేహం లేదు.