రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా అనుహ్య నిర్ణయం తీసుకుంది. తొలి ఇన్నింగ్స్లో 116.3 ఓవర్లలో 497/9 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. సరిగ్గా అదే సమయానికి టీ విరామం తీసుకున్నారు. భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ 212 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో రహానే 115, జడేజా 51 పరుగులు చేశారు.
అంతకు ముందు 224/3 తో రెండోరోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన.. ప్రారంభంలో ధాటిగానే ఆడింది. రోహిత్ పెవిలియన్ చేరిన అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లలో జార్జ్ లిండే 4, రబాడా 3, నోర్జే, డేన్ తలో వికెట్ దక్కించుకున్నారు.