వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కరీబియన్ దీవుల్లో సందడి చేస్తున్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టు విజయాన్ని ఆస్వాదిస్తూ సముద్రంలో బోట్‌పై షికారుకెళ్లారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సహచర క్రికెటర్లైన రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సరదాగా గడిపారు. వీరితో పాటు అనుష్కశర్మ ఉంది.
ఈ విషయాన్ని అశ్విన్ తన ఇన్ స్టాలో పంచుకున్నాడు. "నడి సముద్రంలో సూర్యరశ్మి పడుతుండగా సహచరులతో సరదాగా గడిపాను" అంటూ పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టులో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బోణీ కొట్టింది కోహ్లీ సేన.
ఇది చదవండి: ఈ విజయం అభిమానుల ప్రేమాభిమానాల వల్లే:సింధు