కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ.. శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి నివాళిగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించాలని భారత క్రికెటర్లు నిర్ణయించారు.
జైట్లీ.. దిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీసీఐలో ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆంటిగ్వాలో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హోల్డర్, కమిన్స్ ఉన్నారు.
భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో రాణించాడు. మిగతా వారిలో బుమ్రా, జడేజా, షమి తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇది చదవండి: అరుణ్ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి