ETV Bharat / sports

'ఇప్పుడు ప్రతి ఒక్కరు సైనికుడిలా భావించాలి' - లాక్​డౌన్ గురించి ఛెతేశ్వర్ పుజారా

కరోనా కారణంగా వచ్చిన ఖాళీ సమయాన్ని ఇంటివద్ద కుటుంబంతో గడపడానికి ఉపయోగించుకోవాలని సూచించాడు టీమ్​ఇండియా క్రికెటర్ పుజారా. లాక్​డౌన్​ సమయంలో తాను ఏం చేస్తున్నాడో చెప్పుకొచ్చాడు.

పుజారా
పుజారా
author img

By

Published : Apr 4, 2020, 4:40 PM IST

కరోనా నేపథ్యంలో క్రికెట్ టోర్నీలన్నీ రద్దయ్యాయి. క్రికెటర్లందరూ ఇంటివద్ద కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. టీమ్​ఇండియా ఆటగాడు ఛెతేశ్వర్ పూజారా కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. అయితే ఈ లాక్​డౌన్​లో తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చెప్పాడు.

"భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్‌ విధించి ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ఈ లాక్​డౌన్​కు మద్దతు తెలుపుతున్నారు. కానీ కొంత మంది ఈ వైరస్​ను తేలికగా తీసుకుంటున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సైనికుడిలా భావించాలి. మీరు ఇపుడు ఇంట్లో ఉంటే దేశం కోసం యుద్ధం చేస్తున్నవారవుతారు. ఈ మహమ్మారిని సమష్టిగా ఎదుర్కోవాలి."

-పుజారా, టీమ్ఇండియా క్రికెటర్

ప్రస్తుతం సమయమంతా కుటుంబంతోనే గడుతున్నానని అన్నాడు పుజారా. ఇంట్లోనే జిమ్ ఉండటం వల్ల బయటకు వెళ్లే పని లేదని తెలిపాడు.

"ప్రస్తుతం నేనైతే పూర్తి సమయం కుటుంబానికే కేటాయించా. వారికి నా వంతు సాయం చేస్తున్నా. నా రెండేళ్ల కూతురు అదితితోనే రోజంతా గడిచిపోతోంది. ప్లాస్టిక్ బ్యాట్​తో తను క్రికెట్ ఆడుతుంది. అదృష్టవశాస్తు ఇంట్లోనే జిమ్ ఉంది. అందువల్ల జిమ్ కోసం బయటకు వెళ్లే పని లేదు. రోజూ సైక్లింగ్, రన్నింగ్, యోగా చేస్తా."

-పుజారా, టీమ్ఇండియా క్రికెటర్

"లాక్‌డౌన్‌తో టోర్నీలు లేకపోవడం వల్ల అభిమానులకూ నిరాశ తప్పదు. కానీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు దొరికిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని.. కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగుతారు"’అని పుజారా చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.