ETV Bharat / sports

ఆస్పత్రిలో చేరిన సచిన్​ తెందుల్కర్​

టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల కొవిడ్ బారిన పడిన అతను.. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాడు.

author img

By

Published : Apr 2, 2021, 11:19 AM IST

Updated : Apr 2, 2021, 12:00 PM IST

Team India cricket legend Sachin Tendulkar has been admitted to hospital.
మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సచిన్​

టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల క్రితం కొవిడ్ వచ్చినట్లు వెల్లడించిన మాస్టర్ బ్లాస్టర్​.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపాడు.

అయితే తన కుటుంబ సభ్యులెవరికీ పాజిటివ్ రాలేదని సచిన్​ తెలిపాడు.

  • Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone.

    Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup 🇮🇳 win.

    — Sachin Tendulkar (@sachin_rt) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."

-సచిన్​ తెందుల్కర్, మాజీ క్రికెటర్.

2011 ప్రపంచకప్​ గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా క్రికెట్​ అభిమానులతో పాటు తన సహచరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు మాస్టర్​. ఇటీవల జరిగిన రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న సచిన్​తో పాటు పఠాన్ సోదరులు, బద్రీనాథ్​కు కొవిడ్ నిర్ధరణ అయ్యింది.

ఇదీ చదవండి: దిగ్గజ క్రికెటర్ సచిన్​కు కరోనా పాజిటివ్​

Last Updated : Apr 2, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.