సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీని కైవసం చేసుకుంది తమిళనాడు. ఏకపక్షంగా సాగిన పోరులో బరోడాపై 7 వికెట్ల తేడాతో ట్రోఫీ గెలుచుకుంది దినేశ్ సేన. 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. 13 ఏళ్లలో తమిళనాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి.
మొత్తంగా తమిళనాడుకు ఇది రెండో ట్రోఫీ. 2006-07సీజన్లో ఆ జట్టు తొలిసారి ఈ కప్పును కైవసం చేసుకుంది. ప్రస్తుత 2020-21 సీజన్లో ఫైనల్ వరకు తమిళనాడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
-
D.O.M.I.N.A.N.C.E! 💪👍
— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The @DineshKarthik-led Tamil Nadu unit beat Baroda by 7⃣ wickets in the #Final and clinch the @Paytm #SyedMushtaqAliT20 title in style at the @GCAMotera. 👏👏 | @TNCACricket
Scorecard 👉 https://t.co/UAB2Z0siQm pic.twitter.com/MARKSY4rLK
">D.O.M.I.N.A.N.C.E! 💪👍
— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2021
The @DineshKarthik-led Tamil Nadu unit beat Baroda by 7⃣ wickets in the #Final and clinch the @Paytm #SyedMushtaqAliT20 title in style at the @GCAMotera. 👏👏 | @TNCACricket
Scorecard 👉 https://t.co/UAB2Z0siQm pic.twitter.com/MARKSY4rLKD.O.M.I.N.A.N.C.E! 💪👍
— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2021
The @DineshKarthik-led Tamil Nadu unit beat Baroda by 7⃣ wickets in the #Final and clinch the @Paytm #SyedMushtaqAliT20 title in style at the @GCAMotera. 👏👏 | @TNCACricket
Scorecard 👉 https://t.co/UAB2Z0siQm pic.twitter.com/MARKSY4rLK
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎం సిద్ధార్థ్ ధాటికి (4/20)... 120/9 పరుగులకే చేతులెత్తేసింది బరోడా. విష్ణు సోలంకి(49), అజిత్ సేత్ (29) పోరాడి బరోడాకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తమిళనాడు.. ఏ క్షణంలోనూ తడబడలేదు. హరి నిషాంత్(35), బి అపరాజిత్(29*), దినేష్ కార్తీక్(22), షారుక్ ఖాన్(18*) ఆ జట్టుకు సమష్టిగా విజయాన్నందించారు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో ప్రేక్షకులకు అనుమతి!