ETV Bharat / sports

షెడ్యూల్​ ప్రకారమే పురుషుల టీ20 ప్రపంచకప్​

అనుకున్న తేదీల్లోనే పురుషుల టీ20 ప్రపంచకప్​ జరుగుతుందని స్పష్టం చేసింది ఐసీసీ. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో ఈ టోర్నీ జరగనుంది.

షెడ్యూల్​ ప్రకారమే పురుషుల టీ20 ప్రపంచకప్​
టీ20 ప్రపంచకప్ 2020
author img

By

Published : Apr 6, 2020, 4:51 PM IST

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్​ జరగనుంది. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 మధ్య జరపాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు లీగ్​లు, ఒలింపిక్స్ వంటివి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచకప్​ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)... అనుకున్న తేదీ ప్రకారమే ఈ టోర్నీని నిర్వహిస్తామని చెప్పింది.

icc head office
ఐసీసీ ప్రధాన కార్యాలయం

"టీ20 ప్రపంచకప్​ ప్రాంతీయ నిర్వహణ కమిటీ, ప్రస్తుతం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ టోర్నీ చెప్పిన తేదీ నుంచే ప్రారంభమవుతుంది. ఏడు వేదికల్లో మ్యాచ్​లు నిర్వహించనున్నాం" -ఐసీసీ ప్రకటన

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 5788 మంది కరోనా బారిన పడ్డారు. 39 మంది ప్రాణాలు విడిచారు. అక్కడి ప్రభుత్వం ఈ వైరస్​ కట్టడిపై చర్యలు తీసుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.