ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​: కివీస్​పై గెలిస్తే​ సెమీస్​లో భారత్ - T20 World Cup 2020 newzeland news

మహిళల టీ20 ప్రపంచకప్​లో ఫేవరేట్​గా బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభ మ్యాచ్​లోనే ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. తర్వాత మ్యాచ్​లో బంగ్లాపై మరో విజయం సాధించింది. ప్రమాదకర కివీస్‌తో నేడు పోటీకి సిద్ధమవుతోంది.

T20 World Cup 2020
టీ20 ప్రపంచకప్​: కివీస్​పై గెలిస్తే​ సెమీస్​లో టీమిండియా.?
author img

By

Published : Feb 27, 2020, 6:20 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు ప్రయాణం సాగుతోంది. కఠిన ప్రత్యర్థిగా భావించే న్యూజిలాండ్‌తో మెల్​బోర్న్​ వేదికగా నేడు(గురువారం) తలపడనుంది హర్మన్‌సేన. ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్​ అయిన ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్​.. బంగ్లాపై 18 పరుగులతో విజయం సాధించింది. మరి కివీస్​ అమ్మాయిలపై హ్యాట్రిక్​ విజయం అందుకుంటుందా? ఈ సందర్భంగా కివీస్, టీమిండియా బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో ఉన్న ఉమెన్​ టీమిండియా, ఈ మ్యాచ్​లో గెలిస్తే దాదాపు సెమీస్‌ బెర్త్​ ఖరారు చేసుకోనుంది.

షెఫాలీ విధ్వంసం ముఖ్యం

పదహారేళ్ల డాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ (39, 29 పరుగులు) దూకుడుగా ఆడుతూ జట్టుకు శుభారంభాలు అందిస్తోంది. వన్‌డౌన్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ (26, 34).. ఆమెకు మంచి సహకారం అందిస్తోంది. వీరిద్దరూ ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆసీస్‌ మ్యాచ్​లో గాయపడ్డ ఓపెనర్‌ స్మృతి మంధాన బంగ్లా మ్యాచులో ఆడలేదు. ఆమె కోలుకోవడం వల్ల జట్టు బలం పెరుగుతుంది. ప్రస్తుతానికి టాప్‌ ఆర్డర్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమైంది కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాత్రమే. తొలి రెండు మ్యాచ్​ల్లో రెండంకెల స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్​లో ఆమె ఫామ్‌లోకి రావాల్సి ఉంది. హర్మన్​ చెలరేగితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

పూనమ్‌ తిప్పేయాల్సిందే

మిడిలార్డర్‌లోనూ టీమిండియా మెరుస్తోంది. ఆసీస్‌పై దీప్తిశర్మ 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె చేసిన పరుగుల వల్లే నిజానికి ఆ మ్యాచ్​లో భారత్‌ పోరాడగలిగింది. బంగ్లా మ్యాచ్​లో 20 పరుగులతో అజేయంగా నిలిచిన వేదా కృష్ణమూర్తి మెరుపులు మెరిపిస్తూ ఫామ్‌లోకి వచ్చింది. పూనమ్‌ యాదవ్‌ (7 వికెట్లు)కు తోడుగా పేసర్‌ శిఖా పాండే (5 వికెట్లు) బంతితో రాణిస్తుండటం సానుకూలం. అరుంధతి రెడ్డి, రాజేశ్వరీ గైక్వాడ్‌ సహా మిగతా బౌలర్లు వారికి అండగా నిలుస్తున్నారు.

డివైన్​ అర్ధశతకాలకు బ్రేక్​!

మహిళల క్రికెట్​లో న్యూజిలాండ్‌ బలమైన జట్టు. భారత్‌పై వారికి మెరుగైన రికార్డు ఉంది. కివీస్​ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌, బ్యాటర్‌ సుజీ బేట్స్‌ మంచి ఫామ్​లో ఉన్నారు. డివైన్​ వరుసగా ఆరు అర్ధశతకాలతో టీ20ల్లో చరిత్ర సృష్టించింది. 3208 పరుగులతో పొట్టి ఫార్మాట్​లో అత్యధిక పరుగులు చేసిన మహిళగా దూసుకెళ్తోంది. వీరిద్దరితో పాటు బౌలింగ్​లో పేసర్‌ లీ తహూహూ, లెగ్‌ స్పిన్నర్‌ అమేలియా ఖేర్‌ను అడ్డుకుంటేనే భారత్‌కు విజయం సాధ్యం.

అమీతుమీ

భారత్​తో జరిగిన చివరి మూడు టీ20ల్లో న్యూజిలాండ్​దే పైచేయి. ఏడాది క్రితం హర్మన్‌సేనను 0-3తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐతే 2018లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ను ఓడించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆ మ్యాచులో హర్మన్‌ 103 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.

జట్లు(అంచనా)

భారత్​:

హర్మన్​ ప్రీత్​ కౌర్​(కెప్టెన్​), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్​, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, పూనమ్​ యాదవ్​, రాధా యాదవ్​, తానియా భాటియా(కీపర్​), హర్లిన్​ డియోల్​, రాజేశ్వరీ గైక్వాడ్​, రిఛా ఘోష్​, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, అరుంధతీ రెడ్డి, పూజా వస్త్రకర్​.

న్యూజిలాండ్​:

సోఫీ డివైన్​(కెప్టెన్​), రోజ్​మేరీ, అమేలియా ఖేర్​, సుజీ బేట్స్​, లారెన్​ డౌన్​, మ్యాడీ గ్రీన్​, హోలీ హడల్​స్టోన్​, హేలే జెన్సన్​, లీ క్యాస్పెరెక్​, జెస్​ ఖేర్​, కేటే మార్టిన్​(కీపర్​), కేటీ పెర్కిన్స్​, అన్నే పీటర్సన్​, రఛేల్​ ప్రీస్ట్​, లీ తహూహూ

Last Updated : Mar 2, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.