యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబయి జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు 20 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ప్రకటించారు.
ఈ జట్టులో సూర్య కుమార్తో పాటు ఆదిత్య తారే, యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే తదితరులు ఉన్నారు. బౌలింగ్లో ధవల్ కుల్కర్ణి, తుషార్ దేశ్పాండే ముందుండి నడిపించనున్నారు.
ఎంపికైన అందరూ ఆటగాళ్లు ఆర్టీ పీసీఆర్ టెస్ట్(కొవిడ్ పరీక్ష) చేయించుకుని, అందులో నెగిటివ్గా తేలిన వాళ్లు డిసెంబరు 29న వాంఖడేలో హాజరు కావాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.