ETV Bharat / sports

కోహ్లీ ట్వీట్‌కు సూర్యకుమార్‌ కామెంట్‌ - Suryakumar Yadav kohli

టీమ్​ఇండియా సారథి కోహ్లీని తక్కువ చేస్తూ పోస్ట్ చేసిన ఓ మీమ్‌కు క్రికెటర్​ సూర్యకుమార్ లైక్ కొట్టాడని ఇటీవల నెట్టింట్లో పెద్ద రచ్చ జరిగింది. అయితే తాజాగా ఈ వివాదానికి తెరదించాడు సూర్య. తాను విరాట్​కు అభిమానేనని తెలుపుతూ ట్వీట్​ చేశాడు. దీంతో పాటే త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లో భారత జట్టు గెలుపు చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

Virat Kohli's
కోహ్లీ
author img

By

Published : Nov 18, 2020, 7:09 PM IST

Updated : Nov 18, 2020, 7:55 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, ముంబయి బ్యాట్సమన్‌ సూర్యకుమార్‌ యాదవ్ మధ్య జరిగిన సంఘటన అభిమానులకు జ్ఞాపకమే ఉంటుంది. ముంబయి-బెంగళూరు మ్యాచ్‌లో 13వ ఓవర్ ముగిసిన తర్వాత సూర్యకుమార్‌ వైపు కోహ్లీ వెళ్లడం.. క్రీజులో నిల్చుని విరాట్‌ను సూర్య తీక్షణంగా చూడటం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనకు తనని ఎంపికచేయకపోవడం వల్ల టీమ్​ఇండియా సారథి కోహ్లీకి తన అసంతృప్తి తెలియజేస్తూ అలా చేశాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. అయితే ఇటీవల కోహ్లీని తక్కువ చేస్తూ పోస్ట్ చేసిన ఓ మీమ్‌కు సూర్యకుమార్ లైక్ కొట్టాడని మరోసారి నెట్టింట్లో దుమారం రేగింది. భారత జట్టు కెప్టెన్‌పై గౌరవం లేకుండా చేయడం సరికాదని కోహ్లీ అభిమానులు సూర్యని తీవ్రంగా విమర్శించారు.

కాగా, ఈ వివాదాలకు తెరదించుతూ కోహ్లీకి తాను అభిమానేని సూర్యకుమార్‌ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్నట్లు కోహ్లీ మంగళవారం ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'టెస్టు క్రికెట్‌ సెషన్‌లంటే ఎంతో ఇష్టం' అని వ్యాఖ్య జోడించాడు. వీడియోలో పేసర్లు మహ్మద్‌ షమి, సిరాజ్‌, స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన బంతుల్ని కోహ్లీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే, ఈ వీడియోకి సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. "ఆస్ట్రేలియాలో మీ ఆధిపత్యాన్ని చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నా" అని కామెంట్ పెట్టాడు.

ఇదీ చూడండి : ఐపీఎల్​ 2020: ఆ విషయంలో విరాట్​ కోహ్లీ టాప్​

Last Updated : Nov 18, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.