ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టును శుక్రవారం ప్రకటించారు. అయితే జట్టులో తనకు చోటు దక్కడంపై యువ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ స్పందించాడు. టీమ్ఇండియాకు ఎంపిక కావడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పాడు. అరంగేట్ర మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
-
Feels surreal when you get the call to play for your country🇮🇳
— Prasidh Krishna (@prasidh43) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It's like a dream come true. Excited to play my part and contribute to the success of the team.
Thanks @BCCI. Can't wait to get started. 😊 https://t.co/IQ63JQDBXb
">Feels surreal when you get the call to play for your country🇮🇳
— Prasidh Krishna (@prasidh43) March 19, 2021
It's like a dream come true. Excited to play my part and contribute to the success of the team.
Thanks @BCCI. Can't wait to get started. 😊 https://t.co/IQ63JQDBXbFeels surreal when you get the call to play for your country🇮🇳
— Prasidh Krishna (@prasidh43) March 19, 2021
It's like a dream come true. Excited to play my part and contribute to the success of the team.
Thanks @BCCI. Can't wait to get started. 😊 https://t.co/IQ63JQDBXb
"జాతీయ జట్టులో స్థానం దక్కిందనే భావన నమ్మశక్యంగా లేదు. నా కల నెరవెరబోతోంది. టీమ్ఇండియా విజయానికి నా వంతు కృషి చేస్తాను. బీసీసీఐకి ధన్యవాదాలు. తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"
-ప్రసిద్ధ్ క్రిష్ణ, యువపేసర్
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు ప్రసిద్ధ్. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన క్రిష్ణ.. 9.37 ఎకానమీతో నాలుగు వికెట్లు తీశాడు.
భారత జట్టు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్.
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌కు మరో నలుగురు భారత అథ్లెట్లు