వెస్టిండీస్ స్పిన్నర్ సునిల్ నరైన్ తొలిసారిగా తండ్రయ్యాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. "మాకు తెలియని అనుభూతిని అందించావు. దేవుడి మంచితనం, దయ ఈ చిన్ని ముఖంలో కనిపిస్తోంది. నిన్ను అమితంగా ప్రేమిస్తాం - అమ్మానాన్న" అని వ్యాఖ్య జతచేశాడు.
విండీస్ క్రికెటర్ అయినప్పటికీ భారత్‌లోనూ నరైన్‌కు అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన స్పిన్‌తో పాటు ఓపెనర్‌గా బౌండరీలు బాదుతూ నరైన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ కూడా తండ్రయ్యారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: ఆసీస్-దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా