ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడేందుకు ఆటగాళ్లను మానసికంగా సిద్ధం చేయాలని తమ మానసిక నిపుణుడికి సూచించినట్లు తెలిపాడు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల ఆటగాళ్లలోని అసలైన మానసిక స్థితి బయటపడుతుందని వెల్లడించాడు.
"ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడటం కొంచెం కష్టంగా ఉంటుందని అనుకుంటున్నా. క్రికెట్లో ప్రతి క్రీడాకారుడికి ఇది ఓ మానసిక పరీక్షలా ఉండబోతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను సిద్ధం చేయాలని ఇప్పటికే మా జట్టు మానసిక నిపుణుడికి సూచించా. దాంతో అవసరమైన సమయంలో ఆటగాళ్లలోని భావోద్వేగాలను పొందటానికి వీలుంటుంది.".
- స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ బౌలర్
వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ జో రూట్ దూరం కానున్నాడు. దీంతో తొలిసారిగా జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. అతడి కెప్టెన్సీ గురించీ స్పందించాడు బ్రాడ్. స్టోక్స్‌లో అద్భుతమైన కెప్టెన్ దాగి ఉన్నాడని ప్రశంసించాడు.