ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి కెప్టెన్సీ విషయంలో పోలికలున్నాయని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. భవిష్యత్తులో స్టోక్స్ అద్భుతమైన సారథి అవుతాడని జోస్యం చెప్పాడు.
"సాధారణంగా స్టోక్స్‌కు కోహ్లీతో పోలికలున్నాయి. ఏ పనినైనా వీరిద్దరూ 100 శాతం నిబద్ధతతో చేస్తారు. అందువల్ల భవిష్యత్తులో అద్భుతమైన కెప్టెన్ అవుతాడని అనుకుంటున్నాను. అయితే అతడు పూర్తిస్థాయి సారథిగా ఉండటం మంచిది కాదు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండటం వల్ల స్టోక్స్‌పై పని ఒత్తిడి పెరిగే ప్రమాదముంది" -నాసిర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
రూట్ గైర్హాజరీతో త్వరలో వెస్టిండీస్‌తో మొదలయ్యే తొలి టెస్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లోని బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.
జులై 8 నుంచి ఇంగ్లాండ్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌కు జట్లను ప్రకటించారు. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం వల్ల క్రికెట్ అభిమానులు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి: